అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-09-23T05:09:22+05:30 IST

అర్హులందరికీ సంక్షేమ ప్రథకాలు అందిస్తున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణచైతన్య

 శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

బల్లికురవ, సెప్టెంబరు 22: అర్హులందరికీ సంక్షేమ ప్రథకాలు అందిస్తున్నట్టు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. గురువారం మం డలంలోని గొర్రెపాడు గ్రామంలో జరిగిన గడ ప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆ యన పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి అందిన ఆయా  పథకాలును గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్ధుల చదువు కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. పేదలకు జగనన్న కాలనీల ద్వారా గృహాలను నిర్మించడంతో పాటు ఆ యా కాలనీలలో అవసరమైన మౌలిక సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.  కార్యక్రమంలో ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ పేరయ్య, ఎంపీడీవో కృష్ణ, వైసీపీ నాయకులు స్వాములు, చింతల శ్రీనివాసరావు, అయ్యప్పరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు

బల్లికురవ, సెప్టెంబరు 22: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చే స్తుందని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీ పీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచి న కృష్ణచైతన్య తెలిపారు.  గడ ప గడపకు మన ప్రభుత్వం కా ర్యక్రమం జరిగిన కొప్పెరపాడు, ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరుచేసింది. దీంతో ఆయా గ్రామాలలో మురుగు కా లువల నిర్మాణ పనులకు కృష్ణచైతన్య భూమి పూజ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరు వచేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ చింతల పేరయ్య, ఎంపీ డీవో సీహెచ్‌ కృష్ణ, సర్పంచ్‌ బండారు వెంకాయమ్మ గురవయ్య, పలు గ్రామాలకు చెందిన నేతలు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-23T05:09:22+05:30 IST