జగన్‌ ప్రభుత్వంలో కొందరికే సంక్షేమం

ABN , First Publish Date - 2021-06-24T05:15:53+05:30 IST

జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరడం లేదని, కొద్దిమందికి మాత్రమే అందుతున్నాయని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఆరోపించారు.

జగన్‌ ప్రభుత్వంలో కొందరికే సంక్షేమం
మాట్లాడుతున్న అబ్దుల్‌ అజీజ్‌

ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు

టీడీపీ నేత అజీజ్‌


నెల్లూరు(వ్యవసాయం), జూన్‌ 23 : జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరడం లేదని, కొద్దిమందికి మాత్రమే అందుతున్నాయని తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ ఆరోపించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటూనే అబద్దాలు చెబుతూ ప్రజలను నమ్మించే పనిలో జగన్‌, ఆయన మంత్రులు, నాయకులు ఉన్నారని హేళన చేశారు. 45ఏళ్లు నిండిన ఆడపడుచులు దాదాపు కోటి మంది వరకు ఉంటే కేవలం 23లక్షల మందికే ‘చేయూత’ పథకాన్ని అందించారన్నారు. సంక్షేమ పథకాలు అందరికీ చేరడం లేదని ఎవరైనా ప్రశ్నించినా, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా వారిని అక్రమ కేసులతో అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ఒకరిని కొడితే మరొకరు భయపడతారనే నినాదంతో జగన్‌ ముందుకు వెళుతున్నారని విమర్శించారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులు, బంధువులను పోగొట్టుకుని ఎంతోమంది విద్యార్థులు దుఃఖంలో ఉంటే పరీక్షలు ఎలా రాయగలరని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సాబీర్‌ఖాన్‌, సుధాకర్‌, తిరుమల నాయుడు, గంగాధర్‌, రేవతి, రోజారాణి, అమృల్లా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:15:53+05:30 IST