దర్జీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2021-03-01T06:24:40+05:30 IST

దర్జీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ లక్ష్మీన ర్సింహారెడ్డి కోరారు.

దర్జీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
రామన్నపేటలో జెండాను ఆవిష్కరిస్తున్న టైలర్స్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌

 రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ లక్ష్మీనర్సింహారెడ్డి

మోత్కూరు/ఆలేరు/రామన్నపేట, ఫిబ్రవరి 28: దర్జీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని  రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ లక్ష్మీన ర్సింహారెడ్డి కోరారు. టైలర్స్‌డే సందర్భంగా ఆదివారం మోత్కూరులో మేరుసంఘం ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ  వస్త్ర దుకాణాలతో దర్జీలు ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, వృద్ధాప్యపింఛన్‌ అందించి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో సంఘం అధ్యక్షుడు రేణికుంట్ల రాము, కందుకూరి వెంకన్న, కోటయ్య, టి.లక్ష్మీనర్సయ్య, రవి, ఎం.శెట్టి, కె.భాస్కర్‌, శివ, ఆర్‌.రవి, ఆర్‌.కరుణాకర్‌, రాంమూ ర్తి, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. టైలర్స్‌ డే సందర్భంగా ఆలేరులో ర్యాలీ నిర్వహించారు. అనంతనం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆడెపు రాములు, ఉపాధ్యక్షులుగా బాబు, లత, ఎండి నజీర్‌, కోశాధికారిగా సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా ఐలి వెంకటేష్‌, సలహాదారులుగా ఖలీల్‌, కటకం రాజు, చలన్‌, శారద, ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ నాయకులు రచ్చ శ్రీనివాస్‌, బీమగాని కృష్ణ, రాచర్ల నర్సింహులు, యాకూబ్‌, అర్జున్‌, ఖయ్యూమ్‌, షరీఫ్‌, దామో దర్‌, సుదర్శన్‌ పాల్గొన్నారు. రామన్నపేటలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు సంగిశెట్టి వేణుగోపాల్‌ జెండాను ఆవిష్కరించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ గోదా సు శిరీష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. కార్యక్రమంలో నజీర్‌, ఇబ్రహీం, నర్సిం హ, షబ్బీర్‌, పురుషోత్తం, లక్ష్మయ్య, పిట్టల శ్రీనివాస్‌, మల్లేశం, ఏలూరు రవి, రాములు, హుస్సేన్‌, తబ్రేజ్‌, కుమారస్వామి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:24:40+05:30 IST