సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-07-27T04:06:05+05:30 IST

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
రూరల్‌ మార్ట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌

ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌, జూలై 26 : ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శీల గార్డెన్‌లో ఏర్పాటు చేసిన రేషన్‌ కార్డు లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్‌ హరిచందన, జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజతో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2310మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 0.1 శాతం అనర్హులుగా ప్రకటించి మిగతా 2139 రేషన్‌ కార్డులు జారీ చేశామని ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని అన్నీ మండలాలకు కలిపి 280మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పుర చైర్‌ పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, జడ్పీటీసీ అంజలి పాల్గొన్నారు.

దామరగిద్ద : దామరగిద్ద మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ము బారక్‌ చెక్కులతో పాటు కొత్తరేషన్‌ కార్డులను సోమవారం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ నర్సప్ప, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుమారి, విండో అధ్యక్షుడు ఈదప్ప, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో శశికళ పాల్గొన్నారు.

సహాజసిద్ధంగా తయారు చేసిన వస్తువులు కొనాలి

నారాయణపేట రూరల్‌ : జిల్లా కేంద్రంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరుణ్య రూరల్‌ మార్ట్‌ను సోమవారం కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు సహాజ సిద్ధంగా త యారు చేసిన వస్తువులు కొని ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్‌నాయక్‌, ఏపీడీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:06:05+05:30 IST