West Bengal బీజేపీ అధ్యక్షుడు Sukanta Majumdar అరెస్టు

Published: Sat, 11 Jun 2022 16:52:32 ISTfb-iconwhatsapp-icontwitter-icon
West Bengal బీజేపీ అధ్యక్షుడు Sukanta Majumdar అరెస్టు

కోల్‌కతా: హౌరా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఉత్తర్ దీనజ్‌పూర్ ఎంపీ అయిన మజుందార్‌ను విద్యాసాగర్ సేతులోని టోల్ ప్లాజా సమీపంలో అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

సీఆర్‌పీసీ 144 సెక్షన్ కింద హౌరాలో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయని, ఆ ప్రాంతంలో పర్యటించేందుకు మజుందార్ ప్రయత్నించారని, ఆయన పర్యటన వల్ల శాంతిభద్రతల పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తుగా అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన బీజేపీ ప్రతినిధి నూపర్ శర్మను అరెస్టు చేయాలన్న డిమాండ్‌పై శుక్రవారంనాడు హౌరా జిల్లాలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలను పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండిచారు. బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. ఈ అల్లర్ల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని, అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.