పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల రీషెడ్యూల్

Published: Sat, 15 Jan 2022 17:20:47 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికల రీషెడ్యూల్

కోల్‌కతా : నాలుగు నగర పాలక సంస్థల ఎన్నికలను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) రీషెడ్యూలు చేసింది. అంతకుముందు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఎన్నికలు జనవరి 22న జరగవలసి ఉండగా, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఫిబ్రవరి 12న నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికలను నాలుగు నుంచి ఆరు వారాలపాటు వాయిదా వేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఎస్ఈసీని కలకత్తా హైకోర్టు కోరింది. ఈ ఎన్నికలను రీషెడ్యూలు చేయడానికి సమ్మతిస్తూ అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీకి ఓ లేఖను పంపించింది. 


ఎస్ఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సిలిగురి, చందేర్ నగోర్, బిధాన్ నగర్, అసన్‌సోల్ నగర పాలక సంస్థల ఎన్నికలు జనవరి 22న జరగవలసి ఉంది. శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఎన్నికలు ఫిబ్రవరి 12న జరుగుతాయి. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.