
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాల క్రింద తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నిధులను విడుదల చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించాలని కోరారు.
బెంగాల్ కూలీలకు 100 రోజుల పనికి వేతనాల బాకీని ఎప్పుడు విడుదల చేస్తారని Mamata Banerjee ప్రశ్నించారు. MGNREGA scheme నిధులను నాలుగు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. ఈ నిధులను విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలోని చాలా మంది పేదల జీవనోపాధి కేంద్రం ఇచ్చే నిధులపైనే ఆధారపడి ఉందన్నారు.
పీఎం ఆవాస్ యోజన నిధులను ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. ఈ పథకం క్రింద గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళను నిర్మించిన తొలి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ (West Bengal) అని చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 32 లక్షల ఇళ్ళను నిర్మించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను విడుదల చేయడం లేదన్నారు. ఫలితంగా గ్రామీణాభివృద్ధి కుంటుపడిందని Narendra Modiకి ఈ లేఖ ద్వారా తెలిపారు.
ఇవి కూడా చదవండి