Mamata meets Modi: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ మమత వ్యూహం మార్చారా?

ABN , First Publish Date - 2022-08-05T22:23:10+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో

Mamata meets Modi: ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ మమత వ్యూహం మార్చారా?

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) తో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal CM Mamata Banerjee) భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన్ను కలుసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. ఢిల్లీలో దీదీ నాలుగురోజులుంటారు. రాష్ట్రపతి ముర్మును కూడా కలుసుకుంటారు. నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరౌతారు. 






పశ్చిమబెంగాల్‌లో ఎస్ఎస్‌సీ స్కామ్‌(bengal ssc scam)లో మంత్రి పార్థా చటర్జీ (Partha Chatterjee), ఆయన సహాయకురాలు అర్పితా ముఖర్జీ(arpitha mukherjee) నోట్ల కట్టలతో ఈడీకి దొరికిపోవడంతో తృణమూల్ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. అర్పిత ఫ్లాట్ల నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా నోట్ల కట్టలు, ఐదు కేజీలకు పైగా బంగారం నగలు బయటపడటంతో కలకలం రేగింది. పరువు తీసిన పార్థాను మంత్రి పదవి నుంచి తొలగించి డబ్బుతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలు వాదించారు. అయితే ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది. పార్థా-అర్పిత లీలలు రోజుకొకటి బయటకు వస్తుండటంతో మమతకు దిక్కుతోచడం లేదు. ఈ తరుణంలో ఆమె ప్రధానిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 


మరోవైపు శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా ప్రధానితో సమావేశం కావడం మమత వ్యూహంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు తాము దూరం ఉంటామని తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈలోగా మమత ప్రధానితో సమావేశం కావడం ఆమె వ్యూహాన్ని మార్చారా అనే అనుమానాలు రేకెత్తిస్తోంది. 


అటు ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్ధి జగ్‌దీప్ ధనకర్‌కు ఇప్పటికే బిజూ జనతాదళ్, బీఎస్పీ, టీడీపీ, వైసీపీ మద్దతు ప్రకటించాయి.

Updated Date - 2022-08-05T22:23:10+05:30 IST