యూకే నుంచి కోల్‌కతా వచ్చే విమానాలపై పశ్చిమ బెంగాల్ నిషేధం

ABN , First Publish Date - 2021-12-31T01:33:14+05:30 IST

ప్రాణాంతక కరోనా వైరస్‌లోని నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది...

యూకే నుంచి కోల్‌కతా వచ్చే విమానాలపై పశ్చిమ బెంగాల్ నిషేధం

కోల్‌కతా: ప్రాణాంతక కరోనా వైరస్‌లోని నయా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్టే వేసే చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న యూకే నుంచి వచ్చే విమానాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.


యూకే నుంచి కోల్‌కతాకు వచ్చే అన్ని విమానాలను నిషేధిస్తున్నట్టు పేర్కొన్న ప్రభుత్వం జనవరి 3 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మళ్లీ ప్రకటించే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘నాన్ ఎట్ రిస్క్’ దేశాల నుంచి వచ్చే వారు సొంత ఖర్చుతో కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని ప్రబుత్వం పేర్కొంది.

Updated Date - 2021-12-31T01:33:14+05:30 IST