West Bengalలో 15 రోజుల్లో 82వేలకు చేరిన కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-01-08T18:34:32+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కేవలం పక్షం రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,427కు చేరింది.

West Bengalలో 15 రోజుల్లో 82వేలకు చేరిన కొవిడ్ కేసులు

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కేవలం పక్షం రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,427కు చేరింది. కరోనా రోగుల సంఖ్య గణనీయంగా పెరిగినా కరోనా మృతుల సంఖ్య మాత్రం 0.2 శాతంగా ఉంది. డిసెంబరు 25వతేదీ నుంచి జనవరి 7వతేదీ వరకు కరోనా కేసుల సంఖ్య 82,427కు పెరిగింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వల్ల 157 మంది మరణించగా, వీరిలో ఒక్క కోల్‌కతాలోనే 48 మంది ఉన్నారు.కరోనా కేసుల్లో కేవలం 1797 మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారు. 42, 138 మంది రోగులు హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. కోల్ కతా ఐఐఎం, ఖరగ్ పూర్ ఐఐటీల్లో 150 విద్యార్థులకు కూడా కరోనా సోకింది. 


Updated Date - 2022-01-08T18:34:32+05:30 IST