ఏలూరు: టీడీపీ నేత చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో ఎన్నికలు ముగిసినా ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పెదవేగి మండలం దుగ్గిరాల 5వ వార్డు అభ్యర్ధినిగా గెలుపొందిన టీడీపీ కార్యకర్త కుమారి గెలుపుకు సహకరించావంటూ ఆమె బంధువు, వైసీపీ కార్యకర్త సాగర్‌పై సొంతపార్టీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. దీంతో సాగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.