ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం

ABN , First Publish Date - 2022-03-17T19:25:32+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకం బట్టబయలైంది.

ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్వాకం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకం బట్టబయలైంది. టీడీపీ నేతలు వస్తున్నారని ఐసీయులో చికిత్స పొందుతున్న నాటుసారా బాధితులను  వైద్యులు డిశ్చార్జ్ చేశారు. బాధితులను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్‌కు షిఫ్ట్ చేయకుండా డిశ్చార్జ్ చేయడంపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రీట్మెంట్ పూర్తి కాకుండా బాధితులను డిశ్చార్జ్‌ ఎలా చేస్తారని  టీడీపీ ఏలూరు ఇన్ ఛార్జ్ బడేటి చంటి  ప్రశ్నించారు. కల్తీ సారా వలన ఎంతమంది చనిపోయారో ఆరోగ్య శాఖ మంత్రి నివేదిక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమ్మే మద్యంలో కూడా కల్తీ జరుగుతోందన్నారు. మద్యం వలన కూడా ఏదైనా జరిగితే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రభుత్వం అమ్మే మద్యాన్ని కూడా టెస్టింగ్ చేసి నివేదిక ఇవ్వాలని బడేటి చంటి డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-17T19:25:32+05:30 IST