తండ్రి గొంతుపై కాలితో తొక్కి చంపిన కొడుకు

Sep 27 2021 @ 08:32AM

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సౌత్ పేరుపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రి పట్ల ఓ కొడుకు కసాయిగా మారాడు. తండ్రి ఉల్లంపర్తి(60) గొంతుపై కొడుకు లాజరస్ కాలితో తొక్కి హత్య చేశాడు. ఆస్తిని తన సోదరీలకు ఇచ్చేస్తాడనే అనుమానంతో నిందితుడు లాజరస్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.