ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబాలను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కల్తీ సారా సేవించడం వలనే తమ వారు చనిపోయారని మృతుల కుటుంబీకులు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. కల్తీ సారా సేవించడం వలన శరీర అవయవాలు పాడైపోయాయన్నారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు... ఇదేనా మీరు చేసే పాలన , మీ పాలనలో ప్రజలు ఇంతలా మరణిస్తే మీరు ఏమి చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు. బాధితులను భయపెట్టి అవి సహజ మరణాలు అని బలవంతంగా చెప్పిస్తున్నారని మండిపడ్డారు. ఈ మరణాలకు కారణాలు అన్వేషించి, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి