ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆమరణ నిరాహార దీక్ష మూడవరోజుకు చేరుకుంది. నరసాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాధవనాయుడు ఆమరణదీక్ష చేస్తున్నారు. దీక్షకు భారీ ఎత్తున నరసాపురం నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంఘీభావం తెలుపుతున్నారు.