ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెండు హోల్ సేల్ వంటనూనె షాపుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. స్టాకులో తేడా ఉండడంతో రెండు షాపుల్లో కలిపి 2 కోట్ల 24 లక్షల 32 వేల 150 రూపాయల వంటనూనె నిల్వలు సీజ్ చేశారు. గాదం శెట్టి సుబ్బారావు హోల్‌సేల్ ఆయిల్ షాప్‌లో 53వేల 602 కేజీల స్టాక్ తేడాగా కనిపించింది. దీంతో కోటి 18లక్షల 70 వేల 465 రూపాయల స్టాక్‌ను అధికారులు సీజ్ చేశారు. అలాగే మరో హోల్ సేల్ దుకాణం ధనలక్ష్మి ఆయిల్లో 52 వేల 533 కేజీల తేడాను గుర్తించిన విజిలెన్స్ అధికారులు... కోటి 5 లక్షల 55 వేల 670 రూపాయల స్టాక్‌ను సీజ్ చేశారు.
ఇవి కూడా చదవండి