ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయాన్ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆదివారం ఉదయం సందర్శించారు. స్వామీజీకి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు చేశారు. స్వామిజీతో పాటు చిన వెంకన్నను ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, పుప్పాల వాసు బాబు, కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి