
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వరస్వామిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్లో మన విద్యార్థుల ఇబ్బందులు తొలగాలని, అక్కడి నుండి తీసుకువచ్చే ప్రయత్నం బాగానే జరుగుతుందని తెలిపారు. దేశంలో అద్భుతమైన వ్యవస్థలు నిర్మాణమయ్యాయన్నారు. తెలంగాణ దేశంలో ప్రఖ్యాతి కలిగిన రాష్టంగా తీర్చిదిద్దబడాలని అమ్మవారిని కోరుకున్నానని సోమువీర్రాజు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి