కుర్రకారు హుషారు

ABN , First Publish Date - 2021-01-22T05:43:34+05:30 IST

జిల్లా పర్యటనకు చాలా కాలం తర్వాత వచ్చిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబుకు.. పార్టీ క్యాడర్‌ నీరాజనాలు పలికింది.

కుర్రకారు హుషారు
చంద్రబాబుకు స్వాగతం చెబుతున్న పార్టీ శ్రేణులు

 టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం

 మాజీ మంత్రి పితాని, మాజీ విప్‌ చింతమనేని ఇంట నూతన దంపతులకు ఆశీర్వాదం

ఏలూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి):జిల్లా పర్యటనకు చాలా కాలం తర్వాత వచ్చిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబుకు.. పార్టీ క్యాడర్‌ నీరాజనాలు పలికింది. మాజీ ప్రభు త్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ కుమార్తె వివాహం దుగ్గిరాల లోనూ, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడి వివాహం ఏలూరులోనూ ఇటీవల జరిగాయి. ఈ వివాహ కార్యక్రమాలకు వీరిద్దరూ చంద్రబాబును ఆహ్వానించారు. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగా అప్పట్లో వివాహాలకు హాజరు కాలేకపోయారు. తాజాగా వీరిద్దరి ఇళ్లకు వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించాలని తలపెట్టి గురువారం చంద్ర బాబు జిల్లా పర్యటనకు వచ్చారు. పితాని స్వగ్రామం కొమ్ము చిక్కాలకు వెళుతుండగా.. మార్గమధ్యలో దెందులూరు, అలం పురం, తణుకు, పెరవలి సహా అనేక ప్రాంతాల్లో వందలాది మంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. కొమ్ముచిక్కాలలో చంద్రబాబు వాహన శ్రేణిపై పూలవర్షం కురిపించి అనుకూల నినాదాలతో హోరెత్తిం చారు. దాదాపు రెండున్న ర గంటల ఆలస్యంగా చంద్రబాబు జిల్లాలో కల పర్రు టోల్‌గేటు వద్దకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తన పర్యటనకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు రాకకు ముందే సమాచారం అందుకుని కార్యకర్తలు ఉత్సాహం తో ఆయన వాహన శ్రేణిని అనుసరించారు. మాజీ ఎమ్మెల్యే లు ఈలి నాని, ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు, చింతమనేని పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి వచ్చి చంద్ర బాబుకు నీరాజనాలు పలికారు. కొమ్ముచిక్కాల చేరుకునే సరికే సాయంత్రమైనా కార్యకర్తల్లో ఎక్కడా ఉత్సాహం తగ్గలేదు. పితాని ఇంట తనయుడి నూతన దంపతులను ఆశీర్వదిస్తూనే ఇరు కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం మీడియా తో మాట్లాడారు. అక్కడ నుంచి వెనుతిరిగిన సమ యంలో గుండుగొలను సెంటర్‌లో వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబుకు ఎదురేగి స్వాగతం పలికి.. చంద్ర బాబు అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ఏలూరు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును చూసేందుకు ఆయన వెంట సాగేందుకు కుర్రకారు ప్రయత్నించింది. రెట్టించిన ఉత్సాహంతో ఊగిపోయింది. ఈ ఉత్సాహం చూసిన చంద్ర బాబు సైతం వారిని అనునయిస్తూ ఉత్సాహపరిచారు. రాత్రి ఏలూరు చేరుకున్న చంద్రబాబు చింతమనేని ఇంట నూతన  దంపతులను ఆశీర్వదించారు. కాసేపు ఆ ఇంటే ఉండి యోగక్షేమాలను అడిగారు. అటు పితాని, ఇటు చింతమనేని సేవలను కొనియాడుతూనే టీడీపీ క్యాడర్‌కు కాస్త కిక్‌ ఎక్కించారు.  






Updated Date - 2021-01-22T05:43:34+05:30 IST