కట్టడికి కంటైన్మెంట్లు

ABN , First Publish Date - 2021-04-23T05:21:43+05:30 IST

సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తు న్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు క్షేత్ర స్థా యిలో మళ్లీ కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రారంభిస్తున్నారు.

కట్టడికి కంటైన్మెంట్లు
కంటైన్మెంట్‌గా జోన్‌గా కొవ్వూరు టాక్సీ స్టాండ్‌రోడ్‌

నిర్బంధాలు.. ఆంక్షలు

 వెరీ యాక్టివ్‌, యాక్టివ్‌, డార్మెంట్‌గా విభజన

పాజిటివ్‌ కేసులు వస్తే.. ఆ వీధికి ఇరు వైపులా బారీకేడ్లు 

పట్టణాల్లో ఎక్కువ కేసులు వస్తే వార్డు సచివాలయం మొత్తం రెడ్‌జోన్‌ 

రాకపోకలపై నిషేధాజ్ఞలు

వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, కార్యదర్శులకు బాధ్యతలు


ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 22 : సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తు న్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు క్షేత్ర స్థా యిలో మళ్లీ కంటైన్‌మెంట్‌ జోన్లను ప్రారంభిస్తున్నారు. ఈ జోన్‌ పరిధిలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ఇన్‌స్టెంట్‌ ఆర్డ ర్‌ 101ని విడుదల చేశారు. జిల్లాలో బుధ, గురువారాల్లో మొత్తం 20 మైక్రో కంటైన్మెంట్‌ జోన్లను గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. 

గ్రామాల్లో నిబంధనలు

 గ్రామాల్లో ఏదైనా ఒక వీధిలో ఐదులోపు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయితే అక్కడ మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తారు. పాజిటివ్‌ కేసు వచ్చిన ఇంటికి ఇరు వైపులా మూడు నుంచి నాలుగు నివాసాలను హద్దుగా తీసుకుని బారికేడ్లను ఏర్పాటు చేసి, స్థానికుల రాకపోకలపై ఆంక్షలు/నిషేధం విధిస్తారు.  గ్రామంలో ఒకే ప్రాంతంలో అక్కడక్కడ(ఒకే వీధి కాకుం డా) నివాసాల మధ్య ఐదు పాజిటివ్‌ కేసులకుపైబడి నమోదైతే అక్కడ మాక్రో కంటైన్మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేస్తారు. మొదటి కేసు నమోదైన ఇంటి నుంచి చివరి కేసు నమోదైన ఇంటిని ప్రామాణికంగా తీసుకుని ఇరువైపులా మూడు ఇళ్లు హద్దుగా తీసుకుని రెడ్‌జోన్‌ ఏర్పాటవుతుంది. 

పట్టణాల్లో నిబంధనలు

 పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసు నమోదైన నివాసాన్ని ప్రామాణికంగా తీసుకుని మైక్రో కంటైన్మెంట్‌ జోన్‌గా పరిగ ణిస్తారు. ఎక్కువ కేసులు నమోదైతే సంబంధిత వార్డు సచి వాలయం అంతటినీ మాక్రో కంటైన్మెంట్‌గా పరిగణించి బారీకేడ్లు ఏర్పాటు చేస్తారు.  వెరీయాక్టివ్‌ కంటైన్‌మెంట్‌జోన్‌ ప్రతిపాదనపై కలెక్టర్‌ అను మతిస్తే ఎస్పీ ద్వారా స్థానిక డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలకు సమా చారం ఇస్తారు. ఇలా కంటైన్‌మెంట్‌ జోన్‌లో నివసించే స్థానికులు జోన్‌ దాటి రాకపోకలు సాగించాలంటే ఆంక్షలు విధించడంతోపాటు ముందస్తు అనుమతులు తప్పనిసరి.  కంటైన్‌మెంట్‌ జోన్‌లోని పాజిటివ్‌ బాధితుని ఆరోగ్య విష యాలు, జ్వరం, బీపీ వంటివి రోజూ సంజీవని యాప్‌లో నమోదు చేయాల్సిన బాధ్యత స్థానిక సచివాలయ ఏఎన్‌ ఎంలకు అప్పగించారు.  కంటైన్‌మెంట్‌ జోన్‌లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి వారికి టెస్ట్‌లు చేయడంతోపాటు కంటైన్‌మెంట్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. శానిటైజేషన్‌ చేస్తారు. బారికేడ్లతో ఏర్పాటుచేసిన కంటైన్‌మెంట్‌ జోన్‌ వద్ద పోలీసులు, స్థానిక సచివాలయ వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయ కార్య దర్శితో కూడిన బృందం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.  వెరీ యాక్టివ్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఐదు రోజుల వరకు కొత్తగా పాజిటివ్‌ కేసు నమోదు కాకపోతే యాక్టివ్‌ కంటైన్‌ మెంట్‌గాను, 6–14 రోజుల వ్యవధిలో కొత్త కేసు రాకపోతే డార్మెంట్‌ కంటైన్‌మెంట్‌గాను, 15–28 రోజుల వ్యవధిలో కొత్త కేసు నమోదు కాకపోతే క్లోజ్డ్‌ కంటైన్‌మెంట్‌గాను పరి గణిస్తారు.  ఒకసారి బారికేడ్లతో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్‌ను తొల గించాలంటే మళ్లీ కలెక్టర్‌ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కంటైన్‌మెంట్‌ జోన్లలో నమోదైన పాజిటివ్‌ కేసులను పర్యవేక్షించేందుకు 21 మంది నోడల్‌ అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటుచేశారు. జోన్లలో నివసించే వారికి నిత్యా వసరాలను అందించేందుకు స్థానిక వలంటీర్ల సేవలను వినియోగించుకుంటారు. జిల్లాలో ప్రస్తుతం వున్న పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హోం ఐసొలేషన్‌లోనే ఉన్నాయి.


నేటి నుంచి మద్ది ఆలయం మూసివేత

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 22:కొవిడ్‌ రెండో దశ ఉధృతి దృష్ట్యా గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో దర్శనాలను నిలుపుదల చేస్తున్నట్టు ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. ఆలయ సిబ్బంది కొందరికి కరోనా పాజిటివ్‌ రావ డం, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది భక్తుల ఆరోగ్యం దృష్ట్యా శుక్ర వారం నుంచి నెలాఖరు వరకు దేవస్థానాన్ని మూసివేస్తున్నట్టు తెలిపారు. స్వామి వారి నిత్య కైంకర్యాలు, పూజలు యధావిధిగా అర్చకులు ఏకాంతంగా నిర్వహి స్తారని చెప్పారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ఆంక్షలు విధించారు. పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు. ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదం, తీర్ధ ప్రసాదాలతోపాటు అంతరాలయ దర్శనం నిలుపుదల చేసినట్టు చైర్మన్‌ ఉప్పలపాటి గంగాధర్‌, ఈవో సంగమేశ్వరశర్మ తెలిపారు. 


ఎక్స్‌ప్రెస్‌ వేగంతో కరోనా వ్యాప్తి

834 యాక్టివ్‌ కేసులు

అత్యధిక కేసులు ఏలూరులోనే నమోదు

 ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 22 : జిల్లాలో కొవిడ్‌ కేసుల ఉధృతి ఎక్స్‌ప్రెస్‌ వేగంతో విస్తరిస్తోంది. ఇదే మోతాదులో జిల్లా కేంద్రంలోను కొనసాగుతోంది. తాజాగా ఏలూరు రామచంద్రరావుపేట, పడమరవీధి, గొల్లాయిగూడెం, సత్రం పాడు, రజకులపేట, మల్కాపురం వంటి కొత్త ప్రాంతాలకు కరోనా అడుగుపెట్టింది. దీంతో నగర పరిధిలో ఇప్పటికే సుమారు 120కుపైగా పాజిటివ్‌ కేసులు ఉండగా పలుచోట్ల కంటైన్మెంట్‌ జోన్‌ల ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. గురువారం జిల్లాలో కొత్తగా 90 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో యాక్టివ్‌ కేసుల సంఖ్య 836కి చేరింది. భీమవరం, గణపవరం, జంగారెడ్డిగూడెం, కామవర పుకోట, కొవ్వూరు, నిడదవోలు, తదితర మండలాల్లో కొత్త ప్రాంతాలకు కోవిడ్‌ విస్తరించింది. గురువారం వెల్లడైన టెస్టుల ఫలితాల్లో తూర్పుతాళ్ళు, మాముడూరు, చెరకువాడ, వీరమ్మకుంట, నాయుడుగూడెం పాఠశాలల్లో ఐదుగురు టీచర్లకు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఉండి మండలంలో ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులకు, చెరకువాడ, ద్వారకా తిరుమల మండలంలో ఒక్కో విద్యార్థికి కరోనా సోకింది.




Updated Date - 2021-04-23T05:21:43+05:30 IST