కుంభమేళాకు వెళ్లి వస్తే చుట్టేసింది..

ABN , First Publish Date - 2021-04-22T05:40:46+05:30 IST

పట్టణంలోని 6 వార్డులో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్ప టి వరకు దాదాపు 20 మందిపైనే వైరస్‌ బారినప డ్డారు.

కుంభమేళాకు వెళ్లి వస్తే చుట్టేసింది..
జంగారెడ్డిగూడెం 12వ వార్డులో అడ్డుకట్ట వేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

 నరసాపురం ఆరో వార్డులో కలకలం

 20 మందికిపైగా పాజిటివ్‌

ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

జంగారెడ్డిగూడెంలో కంటైన్మెంట్‌ జోన్‌

డీఈవో కార్యాలయ ఉద్యోగి మృతి

తాజాగా 106 మందికి పాజిటివ్‌

నరసాపురం, ఏప్రిల్‌ 21 : పట్టణంలోని 6 వార్డులో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్ప టి వరకు దాదాపు 20 మందిపైనే వైరస్‌ బారినప డ్డారు. వీరిలో కొందరు పాలకొల్లులోని ఓ ప్రైవేట్‌ ఆస్ప త్రిలో చికిత్స పొంది ఇళ్లకు తిరిగి వస్తే మరికొందరు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అదివారం మరో ఇద్దరికి పాజిటివ్‌ సోకింది. కేసులన్ని వార్డులోని ఒక ప్రాంతంలోనే వస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బాధితులంతా ప్రైవేట్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని, చికిత్స పొందడం వల్ల విషయం బయటకు పొక్కలేదు. మూడు వారాల క్రితం వార్డులోని కొందరు తీర్థయాత్రలకు వెళ్లి హరి ద్వార్‌ కుంభమేళాలో స్నానాలు చేసి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా వీరిలో ఒకరికి జ్వరం వచ్చింది. తగ్గకపోవడంతో పరీక్ష చేయిస్తే కరోనా పాజి టివ్‌ బయటపడింది. అప్పటికే ఆ నివాసంలోని మరో ఇద్దరు ఈ లక్షణాలు ఉండటంతో వెంటనే పాలకొల్లు లో చిక్సిత చేయించుకున్నారు. ఈ విషయం బయట కు పొక్కడంతో వీరితోపాటు తీర్థయాత్రలకు వెళ్లిన వారికి, వచ్చిన తరువాత వీరిని కలిసిన వారికి కూడా వైరస్‌ సోకింది. ఇలా ఈ వార్డులో మొదలైన కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒక ఆలయంలోని పూజారి, ఓ ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగి, పూజారి కుటుం బసభ్యులు, సిద్దాంతి కుటుంబసభ్యులు, ఆర్టీసీ ఉద్యోగి, అతని భార్య, ఫ్లంబర్‌, వంట పనిచేసే వ్యక్తి ఇంట్లో ఒకరితోపాటు మరికొందరు ఈ వ్యాధి బారినపడ్డారు. ఇలా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వార్డులోనే కాకుండా పట్టణంలో చాలామంది వైరస్‌ బారినపడి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ప్రభు త్వం వ్యాధి నిర్ధారణకు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించేది. దీనివల్ల ఫలితం వెంటనే తెలిసేది. వ్యాధిసోకిన వారు తక్షణం వైద్యం తీసుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు వీఆర్‌డీఎల్‌ పరీక్షలు చేస్తుండటంతో ఇవి ఏలూరు వెళ్లి రిపోర్టు వచ్చేందుకు నాలుగైదు రోజులు పడుతోంది. ఈ కారణంగా చాలామంది ప్రైవేట్‌ ఆస్ప త్రులవైపు మొగ్గు చూపుతున్నారు. అక్కడ పరీక్షతోపా టు స్కానింగ్‌ చేయించుకుని  వ్యాధి నిర్దారణ కాగానే చికిత్స పొందుతున్నారు. స్థోమత ఉన్న వాళ్లు మెరుగై న వైద్యం కోసం హైదరాబాద్‌, విజయవాడ, రాజమం డ్రి ప్రాంతాల్లోని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళుతున్నారు.   


డీఈవో కార్యాలయంలో విషాదం

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 21: కరోనా పాజిటివ్‌ తో డీఈవో కార్యాలయ ఉద్యోగి కోటేశ్వరరావు విజయ వాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృ తి చెందారు. దీంతో జిల్లా విద్యాశాఖలో విషాదం నెల కొంది. ఇప్పటికే అసిస్టెంట్‌ డైరెక్టర్‌, జూనియర్‌ అసి స్టెంట్‌, ఉద్యోగులు కరోనా సోకి హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆకివీడు సీహెచ్‌సీ ల్యాబ్‌ టెక్నీషియన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్దారణ కావడంతో విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


106 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో కొవిడ్‌ కేసులు మూడంకెలకు చేరుకుంది. బుధవారం 106 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావ డంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 660కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 95,363కు చేరాయి. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నిర్ధారణ అవుతున్న ప్రాం తాల్లో ఏలూరు తొలి రెండంకెలతో తొలి స్థానంలో ఉం డగా, ఆ తదుపరి కొవ్వూరు, తాడేపల్లిగూడెం, యల మంచిలి, తాళ్ళపూడి, వేలేరుపాడు ఉన్నాయి. 


జిల్లాకు 30 వేల డోసుల కోవి షీల్డ్‌

జిల్లాకు బుధవారం 30 వేల డోసుల కొవి షీల్డ్‌ వ్యాక్సిన్‌ నిల్వలు దిగుమతయ్యాయి. వీటిని జిల్లాలో రెండో డోసు టీకా మందు కోసం ఎదురుచూస్తున్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, హెల్త్‌కేర్‌ వర్కర్లు, సీనియర్‌ సిటిజన్లకు గురువారం వేసేందుకు ప్రత్యేకించినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. బుధవారం 2,436 డోసుల వ్యాక్సిన్‌ నిల్వలకు టీకా మందు పంపిణీని జిల్లాలో 30 సెషన్‌ సైట్లలో ప్రారంభించగా పలుచోట్ల ఈ వ్యాక్సిన్‌ కోసం సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరాశతో వెనుతిరిగారు.


రెండో డోసు పంపిణీకి ఏర్పాట్లు : కలెక్టర్‌ 

ఏలూరు, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి):జిల్లాలోని అన్ని వాక్సినేషన్‌ కేంద్రాల్లో గురువారం కొవి షీల్డ్‌ రెండో డోసు వేయనున్నట్టు కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ప్రకటిం చారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన కొవిడ్‌ ప్రత్యేక అధికారులతో సమావేశమయ్యారు. 104 కొవిడ్‌ కాల్‌ సెంటర్‌లో రెండు స్ర్కీన్లు ఏర్పాటు చేసి ఒక స్ర్కీన్‌లో వాక్సినేషన్‌ వివరాలు, మరో స్ర్కీన్‌లో కాల్స్‌ వివరాలు మానిటర్‌ చేయాలన్నారు. జేసీ హిమాన్షు శుక్లా, డీఆర్‌డీఏ పీడీ జే.ఉదయభాస్కర్‌, డీఎంహెచ్‌వో సునంద, డీసీఎంఎస్‌ మోహన్‌, కొవిడ్‌ నోడల్‌ అధికారులు పాల్గొన్నారు. 


కంటైన్మెంట్‌ జోన్‌.. మళ్లీ మొదలు

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 21 : పట్టణంలోని 12వ వార్డులో కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో కంటైన్మెంట్‌ జోన్‌గా గుర్తించారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులు అప్రమ త్తమయ్యారు. ఆ రోడ్డులో ప్రజలు బయటకు, బయటి వారు లోనికి రాకపోకలు సాగించ కుండా కర్రలతో అడ్డంగా కట్టారు. రాజుల కాల నీ సచివాలయ పరిధిలో కేఎల్‌ఎన్‌ రాజు వీధి నుంచి డీసీసీబీ కల్యాణ మండపం రోడ్డు వరకు బపర్‌ జోన్‌గాను, గాయత్రీ అపార్ట్మెంట్‌ నుంచి సూర్య డిజైన్‌ అపార్ట్మెంట్‌ వరకు రెడ్‌ జోన్‌గా గుర్తించారు. సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత జిల్లాలో ఇదే తొలి కంటైన్మెంట్‌ జోన్‌ కావడం విశేషం. 


Updated Date - 2021-04-22T05:40:46+05:30 IST