అత్యాచారాల కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2021-01-22T05:41:16+05:30 IST

షెడ్యూల్‌ కులాలు, తెగల అత్యాచారాల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు.

అత్యాచారాల కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం తగదు

ఏలూరు క్రైం, జనవరి 21 : షెడ్యూల్‌ కులాలు, తెగల అత్యాచారాల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. తన కార్యాలయం నుంచి  పశ్చిమ, కృష్ణ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్సులో నిర్వహించారు. ఇప్పటి వరకూ నమోదైన కేసుల విచారణ వేగవంతం చేసి, నిందితులను త్వరితగతిన అరెస్ట్‌ చేయా లని ఆదేశించారు. కేసు దర్యాప్తు సమయంలో పాటించాల్సి నిబంధనలను పాటించాలన్నారు. ఛార్జిషీట్లను సకాలంలో కోర్టుకు సమర్పించాలన్నారు. మైనర్లపై, మహిళలపై దాడు లు చేసే వారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏలూరు ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ ఎ.శ్రీని వాసరావు, నర్సాపురం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, కృష్ణా జిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు, గుడివాడ డీఎస్పీ సత్యానందం, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి, చింతూరు డీఎస్పీ ఖాదర్‌ బాషాలు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:41:16+05:30 IST