ప.గో. జిల్లాలో పోలీసుల కార్డాన్ సెర్చ్

Oct 14 2021 @ 11:43AM

ప.గో. జిల్లా: బుట్టాయగూడెం మండలం, ముత్తప్పగూడెం, కొవ్వాడ గ్రామాలలో స్పెషల్ పార్టీ పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సారా తయారీదారుల ఇళ్లు, పొలాలలో తనిఖీలు చేశారు.15 లీటర్ల సారా, సారా తయారీకి ఉపయోగించే 6 పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. వెయ్యి లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. ఈ కార్డన్ సెర్చ్‌లో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి పోలీసులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.