సీఎం జగన్ సభలో యువకుడు హల్‌చల్

Published: Tue, 21 Dec 2021 15:45:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీఎం జగన్ సభలో యువకుడు హల్‌చల్

ప.గో.జిల్లా: తణుకులో జరిగిన సీఎం జగన్ సభలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు బారికేడ్లను దూకి సభా వేదికవైపు దూసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అడ్డుకుని పక్కకు తీసుకువెళ్లారు. ఆ యువకుడు ఒంటి నిండా వైసీపీ రంగులు పూసుకుని సభా ప్రాంగణంలో హంగామా చేశాడు.


అలాగే తణుకులో జరిగిన జగన్ సభలో ఓ మహిళా నినాదాలు చేయడం కలకలం రేపింది. తనకు పెన్షన్ రావడంలేదంటూ ఆందోళనకు దిగింది. వెంటనే అక్కడున్న అధికారులు ఆ మహిళకు సర్దిచెప్పారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.