పోలవరం ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న కేంద్రమంత్రి షెకావత్

ABN , First Publish Date - 2022-03-04T18:54:43+05:30 IST

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న కేంద్రమంత్రి షెకావత్

ప.గో.జిల్లా: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టు పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనలో సీఎం జగన్ కూడా పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత కేంద్ర మంత్రి పోలవరం పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పురోగతి ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలున్నాయి. టీడీపీ హయాంలో మూడేళ్ల కాలంలో దాదాపు 70 శాతం పనులు పూర్తికాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో కేవలం పది శాతం మాత్రమే పూర్తయింది.


ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు విషయానికి వస్తే నిర్వాసితులు ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు. నిర్వాసితులకు కొత్త ఇల్ల నిర్మాణాలు చేపట్టలేదు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ఇల్లకు కొద్ది పాటి పనులు జోడించి లబ్దిదారులకు ప్రభుత్వం అందజేసింది. ఆ కాలనీలో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో కొందరు లబ్దిదారులు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.

Updated Date - 2022-03-04T18:54:43+05:30 IST