
ప.గో.జిల్లా: నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకు అఖిలపక్ష నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మాధవ నాయుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు శనివారం ఆయన దీక్షను భగ్నం చేసి ఆస్పత్రిలో చేర్చారు. మాధవ నాయుడు ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగించారు. సోమవారం అఖిలపక్ష నాయకులు ఆస్పత్రికి చేరుకుని బండారుకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఇవి కూడా చదవండి