పీఆర్‌సీ, డీఏ అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-07-24T06:04:45+05:30 IST

పీఆర్‌సీ, డీఏ అమలు, సీపీఎస్‌ రద్దు వంటి పలు ప్రధాన సమ స్యలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వ ర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

పీఆర్‌సీ, డీఏ అమలు చేయాలి
ఏలూరులో ఉపాధ్యాయుల ధర్నా

జిల్లావ్యాప్తంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసనలు

ఏలూరు రూరల్‌, జూలై 23 : పీఆర్‌సీ, డీఏ అమలు, సీపీఎస్‌ రద్దు వంటి పలు ప్రధాన సమ స్యలపై ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వ ర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు ధర్నా చేసి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మద్దతు తెలిపి ప్రసంగించారు. పీఆర్‌సీ నివేదికను బహిరంగ పరిచి 2018 జూలై 1 నుంచి అమలు చేయాలన్నారు. ఆరు విడతల కరువు భత్యాన్ని మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్‌సీ మూడేళ్లుగా అమలు చేయలేదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిపడ్డ ఆరు డీఏలను విడుదల చేయాలన్నారు. నూతన విద్యా విధానంపై స్పష్టత ఇవ్వాలన్నారు. 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించరా దన్నారు. ఫ్యాప్టో చైర్మన్‌ పి.నారాయణ, జిల్లా జేఏసీ కన్వీనర్‌ చోడగిరి శ్రీనివాస్‌, ఫ్యాప్టో కో చైర్మన్‌ జయకర్‌ మాట్లాడారు. పురపాలక, ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యల సాధనకై, కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా అన్ని శాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. అనం తరం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ్యాప్టో నాయకులు పీవీ రమణ, బి.సాయిరాజు, వెంకటేశ్వరరావు, శివరాం, నంబూరి రాంబాబు, పీఈటీ అసోసియేషన్‌ నాయకులు రమేష్‌, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

Updated Date - 2021-07-24T06:04:45+05:30 IST