అంతు చిక్కని వ్యాధితో 16 మేకలు మృతి

ABN , First Publish Date - 2021-02-28T05:13:23+05:30 IST

రాచన్న గూడెం అడవి ప్రాంతంలో అంతు చిక్కని వ్యాధితో మేకలు మృతి చెం దాయి.

అంతు చిక్కని వ్యాధితో 16 మేకలు మృతి
రాచన్నగూడెం అడవిలో మృతి చె ందిన మేకల వద్ద యజమాని

జీలుగుమిల్లి, ఫిబ్రవరి 27: రాచన్న గూడెం అడవి ప్రాంతంలో అంతు చిక్కని వ్యాధితో మేకలు మృతి చెం దాయి. స్థానికులు, మేకల యజ మాని  తెలిపిన వివరాలు ప్రకారం... టి.నరసా పురానికి చెందిన పేరుబోయిన వెంక టేశ్వరావు, భార్య లక్ష్మీ కొన్ని నెలలుగా రాచన్నగూడెంలో ఉంటూ సమీప అటవీ ప్రాంతంలో మేకల్ని మేపుతూ జీవిస్తున్నారు. ప్రతీ ఎటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాంతానికి వచ్చి మేకల్ని మేపుతుంటారు. అయితే శుక్ర వారం కొన్ని మేకలు నీరసించాయి. శనివారం అడవిలో ముందుగా ఆరు మేకలు నోరు ముక్కు నుంచి నీరు కారుతూ చనిపోయాయి. అనంతరం 10 మేకలు సాయంత్రానికి చనిపో యాయి. మొత్తం 16 మేకలు మృతి చెందినట్లు బాధితులు వాపోతున్నారు. సూమారు రూ.2లక్షలు నష్టం వచ్చినట్లు తెలిపారు. ఈ సంఘటనతో మిగిలిన పశువుల కాపరులు కంగారు పడుతున్నారు. ్చ్చ


Updated Date - 2021-02-28T05:13:23+05:30 IST