ఆమె ఓటే ఆయుధం..

ABN , First Publish Date - 2021-02-28T04:46:46+05:30 IST

నిడదవోలు పురపాలక సంఘానికి జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారారు.

ఆమె ఓటే ఆయుధం..

పురపోరులోనూ మహిళల ఓట్లే కీలకం

నిడదవోలు, ఫిబ్రవరి 27 : నిడదవోలు పురపాలక సంఘానికి జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారారు. పట్టణంలోని 1 నుంచి 28 వరకు ఉన్న 28 వార్డుల్లో కూడా మహిళా ఓటర్లే కౌన్సిల్‌ అభ్యర్థుల గెలుపు ఓటముల్లో కీలకం కానున్నారు. పట్టణంలో 28 వార్డులకు సంబంధించి  పురుష ఓటర్లు 16,063 కాగా మహిళా ఓటర్లు 17,551 ఉండగా మొత్తం ఓట్లు 33,614 ఉన్నాయి. వీటిలో పురుషుల కన్నా 1488 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో పట్టణంలో గెలుపోటములను నిర్ధేశించేది మహిళామణులే. అలాగే పట్టణంలోని 1 నుంచి 28 వరకు ఉన్న వార్డుల్లో ప్రతి వార్డులోను పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ధేశించేది మహిళలే. 

Updated Date - 2021-02-28T04:46:46+05:30 IST