పశ్చిమ గోదావరి: నరసాపురంలో కార్తీక మాసం ముగియడంతో భక్తులు వశిష్ట గోదావరికి పోటెత్తారు. పోలు పాడ్యమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు గోదావరిలో పుణస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో స్నాన ఘటాలు రద్దీగా మారాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేసి గోదావరిలో పోలి స్వర్గం వద్ద దీపాలను వదులుతున్నారు.