12వ చైర్మన్‌ ఎవరో..?

ABN , First Publish Date - 2021-03-01T05:12:27+05:30 IST

చైర్మన్‌ అభ్యర్థి ఎవరు... మునిసిపల్‌ ఎన్నికల్లో తొలుత వినిపించే మాట ఇది.. ఆయన మంచివాడైతే మన ఓటు ఆయనకే.. ఎందుకంటే ఏదో మంచి చేస్తాడని ఆశ..

12వ చైర్మన్‌ ఎవరో..?

ఇప్పటి వరకూ నిడదవోలు చైర్మన్లుగా 11 మంది

నిడదవోలు, ఫిబ్రవరి 28 : చైర్మన్‌ అభ్యర్థి ఎవరు... మునిసిపల్‌ ఎన్నికల్లో తొలుత వినిపించే మాట ఇది.. ఆయన మంచివాడైతే మన ఓటు ఆయనకే.. ఎందుకంటే ఏదో మంచి చేస్తాడని ఆశ.. ప్రతీ ఎన్నికల్లోనూ పట్టణ ఓటరు ఇలాగే ఆలోచిస్తాడు.. చైర్మన్‌ అభ్యర్థిని చూసి ఓటేస్తాడు. నిడదవోలు మునిసిపాలిటీనే తీసుకుంటే ఇప్పటి వరకూ 11 మంది చైర్మన్లుగా పాలించారు.ఈ నెల 10వ తేదీన జరిగే ఎన్నికల్లో 12వ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. మేజర్‌ పంచాయతీగా ఉన్న నిడదవోలు 1964లో పురపాలక సంఘంగా ఏర్పడింది. అంటే సుమారు 57 ఏళ్లయింది. డిసెంబరు 1, 1964 నుంచి 19 అక్టోబరు 1967 వరకు అంటే సుమారు మూడు మూడేళ్లు ప్రత్యేక అధికారి పాలనలో  సాగిం ది. నిడదవోలు మొట్టమొదటి మునిసిపల్‌ చైర్మన్‌గా డాక్టర్‌ బీవీఎల్‌ఎన్‌ రాజు 20 అక్టోబరు 1967 నుంచి 8 ఫిబ్రవరి 1970 వరకు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం నిడదవోలు పురపాలక సంఘా నికి 11 మంది చైర్మన్లుగా కొనసాగారు. మునిసిపల్‌ చైర్‌ పర్సన్స్‌గా డాక్టర్‌ తోపరాల శ్రీరామలక్ష్మి, మాగాపు వెంకట రామలక్ష్మి  బాధ్యతలు నిర్వహించారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు 8 మంది ప్రత్యేక అధికారులు పరిపాలన చేశారు. ఇప్పుడు జరుగుతున్న మునిసిపల్‌ ఎన్నికలలో నిడదవోలు పురపాలక సంఘానికి 12వ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.

Updated Date - 2021-03-01T05:12:27+05:30 IST