విలీనం చేయవద్దు

ABN , First Publish Date - 2021-03-01T05:16:50+05:30 IST

కుంచనపల్లి గ్రామాన్ని తాడేపల్లి గూడెం మునిసిపాలిటీలో విలీనం చేయవద్దంటూ గ్రామస్థులు ఆదివారం ఆం దోళనకు దిగారు.

విలీనం చేయవద్దు
జాతీయ రహదారిని దిగ్బంధం చేసిన కుంచనపల్లి గ్రామస్థులు

జాతీయ రహదారిపై కుంచనపల్లి గ్రామస్థుల రాస్తారోకో

తాడేపల్లిగూడెం రూరల్‌, ఫిబ్రవరి 28 : కుంచనపల్లి గ్రామాన్ని తాడేపల్లి గూడెం మునిసిపాలిటీలో విలీనం చేయవద్దంటూ గ్రామస్థులు ఆదివారం ఆం దోళనకు దిగారు. జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి మునిసిపాలిటీలో వద్దు..గ్రామంగానే కొనసాగించాలని నినాదాలు చేశారు.మాజీ సర్పంచ్‌ జువ్వల వెంకటేశ్వరరావు, మణికుమారిల నేతృత్వంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయా యి.ప్రభుత్వం స్పందించి విలీన ఉత్తర్వులు వెనక్కు తీసుకునే వరకూ పోరా టం ఆగదని హెచ్చరించారు.తమ ఆందోళనకు నాయకులు కలిసి రావాల న్నారు.మిగిలిన విలీన గ్రామాలు కలిసి వస్తే ఆందోళన తీవ్ర తరం చేద్దామ న్నారు. రూరల్‌ సీఐ వీరా రవికుమార్‌ రాస్తారోకోను అడ్డుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నియంత్రించారు. దీంతో ఆందోళన విరమించారు. 

Updated Date - 2021-03-01T05:16:50+05:30 IST