ధన జాతర

ABN , First Publish Date - 2021-03-08T06:16:38+05:30 IST

నిన్నమొన్నటి వరకూ చేతిలో రూపాయి లేదని ముఖం చాటేసిన అభ్యర్థులు ఆదివారం నాటికి తమ పంథా మార్చారు. పోటీ చేస్తున్న వార్డులు, డివిజన్లలో మాకు కావాల్సింది ఓటు మీకు కావాల్సింది నోటు పేరిట రంగంలోకి దిగారు.

ధన జాతర

పురపోరులో రసవత్తర పంపిణీ 

ఇంటింటికీ వెయ్యి.... చీర, జాకెట్‌

మహిళా ఓటర్లకు ప్రత్యేకంగా ఎర

తాగినోడికి తాగినంత మందు 

రెచ్చిపోయిన అధికార వైసీపీ

మిగతా పక్షాలది రూ. 3 నుంచి 5 వందలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

నిన్నమొన్నటి వరకూ చేతిలో రూపాయి లేదని ముఖం చాటేసిన అభ్యర్థులు ఆదివారం నాటికి తమ పంథా మార్చారు. పోటీ చేస్తున్న వార్డులు, డివిజన్లలో మాకు కావాల్సింది ఓటు మీకు కావాల్సింది నోటు పేరిట రంగంలోకి దిగారు. మహిళలకు సంప్రదాయం ప్రకారం నగదుతో పాటు చీరలు కూడా పంపిణీ చేస్తున్నారు. ఒక్కోచోట ఓటుకు వెయ్యి నుంచి రూ. 1500 వరకూ పంపిణీ ప్రారంభించారు. కొన్నిచోట్ల రెండు వేల వరకూ ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో అధికార వైసీపీదే పైచేయిగా ఉన్నది. ఏలూరు కార్పొరేషన్‌ సహా అన్ని మునిసిపాలిటీల్లోనూ నగ దు ప్రవాహం భారీగా ఉంది. అధికారపార్టీ అభ్యర్థులు డబ్బు ను లెక్క చేయకుండా విచ్చలవిడిగా వెదజల్లుతున్నారు. కొన్ని మునిసిపాలిటీల్లో రూ.1000 నుంచి 1500 వరకూ ఓటర్ల ఇళ్లకే పంపుతున్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ ఉన్న మొత్తం 50 డివిజన్లలో ఎవరిది పైచేయి కాబో తుందనే అంశంలో ఇప్పటికీ సస్పెన్స్‌ కొనసాగుతోంది.  ఉద్యో గులు, వ్యాపారులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో  కేవలం స్లమ్‌ ప్రాంతాల్లోనే డబ్బు పంపిణీకి తెరలేపారు. ఒక్కో డివి జన్‌లో ఒక్కో రీతిలో వ్యవహారం సాగుతోంది. కొన్నిచోట్ల ఓటు కు రూ.500 ఇవ్వడానికి సిద్ధపడగా, ఇంకొన్నిచోట్ల రూ.1200 వరకూ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసి చేతిలో పెడుతు న్నారు. డివిజన్ల వారీగా పరిస్థితిని అంచనా వేసి ఎక్కడైతే బలహీనంగా పార్టీ అభ్యర్థి ఉందనుకుంటున్నారో అక్కడే పూర్తిశక్తిని కేంద్రీకరించారు. టీడీపీ బలంగా ఉన్న డివిజన్లలో ఆదివారం రాత్రి నుంచే నగదు పంపిణీ ఆరంభించారు. చాలా వార్డుల్లో ఓటర్లను ఆకర్షించి, ఆ మేరకు నగదు ముట్ట చెప్పారు. ఆ మేరకు ఒట్టు వేయించుకున్నారు. కొన్నిచోట్ల ప్రజలు పెద్ద మనుషులే సాక్షులుగా తమ ‘పని’ పూర్తి చేశా రు. ప్రతి డివిజన్‌లోనూ దాదాపు  నాలుగు నుంచి ఆరు వేల వరకూ ఓట్లు ఉన్నాయి. అభ్యర్థులు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు తొలుత వెనుకాడారు. అధికారపార్టీ కొంత ఫండ్‌ సమకూర్చింది. ఆదివారం నాటికి ఇది కాస్త పెంచారు. ఏలూరులో పోటీ చేస్తున్న అభ్యర్థులందరికి కొంత సొమ్ము చేతికందింది. మిగతాదంతా వ్యక్తిగతంగా భరించేందుకు అభ్య ర్థులే సిద్ధపడుతున్నారు. ఈ కార్పొరేషన్‌లో అధికార పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంలో ఇప్పటికే భారీఎత్తున బెట్టిం గులు సాగుతున్నాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన అభ్యర్థులు ఢీకొంటున్నారు. ఆదివారం వరకూ ఓటుకు ఒక రేటు పలకగా మంగళవారం నాటికి ఈ రేటు రెట్టింపు అయ్యే అవకాశాలు లేకపోలేదు. 


మునిసిపాలిటీల్లోను అదే తీరు

జంగారెడ్డిగూడెం, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు అన్నింటిలోనూ ఒకటికి రెండు సార్లు ఆరా తీసి మరీ నగదు, చీర జాకెట్టు, ఇంటి పట్టా, రోజువారీ అవసరాలు తీరేలా ప్రభుత్వ పథకాల అమలు వంటి హామీలను వైసీపీ అభ్య ర్థులు విస్తృతంగా ప్రచారంలోకి దించారు. దీనికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయి. నిడదవోలు మునిసిపాలిటీలో కొన్ని వార్డుల్లో రూ.1000 నుంచి 1500 వరకూ నగదు ఓటర్ల వైపు విసురు తున్నారు. నర్సాపురంలోనూ ఇప్పటికే రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ ఓటర్లను నడిపించే శక్తి ఉన్న నేతలందరినీ కొన్ని రోజులుగా మద్యం మత్తులో ముంచెత్తుతున్నారు. కావా ల్సినంత కడుపునిండా పట్టిస్తున్నారు. అర్ధరాత్రి వరకూ చాటిం గ్‌లు రేటింగులతో ఇలాంటి వారంతా రెచ్చిపోతున్నారు. తడ బడే మాటలతో తమ వారికి ఫోన్‌ చేసి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నారు. కొవ్వూరులో కేవలం మూడు స్థానాలకు దూరంగా ఉన్న చైర్మన్‌ పదవి కోసం వైసీపీ దాదాపు అన్నిం టిని మోహరించింది. గెలుపే ధ్యేయంగా మిగతా పార్టీలు ఇదిగో.. డబ్బు అంటూ నోట్లను ఏ వార్డులకు ఆ వార్డులు లెక్క గట్టి మరీ పంపిణీ చేస్తున్నారు.  


ఏరులైపారుతున్న మద్యం  

ఎలాగూ నేటితో ప్రచారానికి తెర పడనుంది. పురపోరులో రంగంలో ఉన్న అభ్యర్థులందరికీ తమకు కావాల్సిన వారిని మత్తెక్కించేందుకు భారీ ఎత్తున పెట్టుబడి అవసరం అవుతు న్నది. దీనికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ కొంత మంది పట్ట ణాల్లో ‘మందు’ను సమకూరుస్తున్నారు. కొందరైతే రేయింబవళ్ళు తాగి చెలరేగిపోతున్నారు. అభ్యర్థులకు సైతం మందు ఖర్చు తడిచి  మోపెడు అవుతోంది. 


మహిళా ఓటర్లకు చీరలు, వరాలు  

పుర సమరంలో మహిళా ఓటర్లే కీలకం. దీనిని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా సామాన్య, మధ్య తరగత ప్రాం తాలవైపు దృష్టి పెట్టారు. ఇక్కడి వారంతా ఓటరు అయితే చాలు. తగ్గట్టుగానే అక్కడికక్కడే చీర, జాకెట్‌ ఇచ్చి సాయం త్రం ఇంటికి డబ్బు పంపిస్తామంటూ కాస్తంత ఓపికగా ఎర వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇచ్చే చీర కాస్తంత ఖరీదైన ట్లుగా భ్రమింపచేస్తున్నారు. ఇంకేముంది మహిళా ఓటర్లు తమ చేతికందిన చీరను చూసి మురిసి పోతున్నారు. ఇంకా రాని వారంతా ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారు. 


Updated Date - 2021-03-08T06:16:38+05:30 IST