మట్టి డాన్‌..!

ABN , First Publish Date - 2021-03-07T05:14:24+05:30 IST

తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో కొన్నేళ్ల క్రితం వరకు ఆయన ఓ సామాన్యుడు. మట్టి తవ్వే యంత్రాలకు ఆపరేటర్‌గా చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఇప్పుడు కొన్ని జేసీబీలకు యజ మాని..

మట్టి డాన్‌..!
తాడేపల్లిగూడెంలోని మునిసిపల్‌ చెరువును తవ్వేసిన మట్టి డాన్‌

గట్టు, పుట్టలు తవ్వేస్తున్న కాంట్రాక్టర్‌..  

ఒకప్పుడు జేసీబీ ఆపరేటర్‌.. ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు

అధికార పార్టీ అండదండలతో.. చెరువులను తవ్వేస్తూ.. 

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో కొన్నేళ్ల క్రితం వరకు ఆయన ఓ సామాన్యుడు. మట్టి తవ్వే యంత్రాలకు ఆపరేటర్‌గా చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. ఇప్పుడు కొన్ని జేసీబీలకు యజ మాని.. కోట్ల రూపాయలకు అధిపతి.  ప్రభుత్వ భూములను మెరక చేసే కాంట్రాక్టులు, నీరు–చెట్టు పనుల్లో చెరువు తవ్వకాలు చేస్తుంటాడు. అదే అత నికి వరమైంది. ప్రభుత్వ భూముల్లోనే అక్రమంగా మట్టి తవ్వకాలు సాగించడంలో ఆ కాంట్రాక్టర్‌ది అందెవేసిన చేయి. తాజాగా తాడేపల్లిగూడెంలో మునిసిపల్‌ చెరువులో మట్టి తవ్వకానికి ఒడిగట్టా డు. మూడు ఎకరాల చెరువు తవ్వేందుకు పక్కా ప్రణాళిక చేశాడు. రాత్రి వేళల్లో ఎక్స్‌కవేటర్లతో చెరువు తవ్వకాలు ప్రారంభించాడు. చెరువు గట్టు ను వదల్లేదు. దీనిపై స్థానికులు మున్సిపల్‌ అధికా రులకు ఫిర్యాదు చేశారు.అయితే తనకు నియోజకవర్గ అధికార పార్టీ నేత అండదండలు ఉన్నాయంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అయినా అధికారులపై ప్రతిపక్ష పార్టీల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో మున్సిపల్‌ అధికారులు రంగంలోకి దిగారు. ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లను స్వాధీ నం చేసుకున్నారు. సీజ్‌ చేసే అధికారం లేకపోవ డంతో విడచి పెట్టేశారు. వాస్తవానికి వాటిని సం బంధిత అధికారులకు అప్పగించాల్సి ఉంది. రాజకీ య అండదండలు ఉండడంతో సదరు కాంట్రాక్టర్‌ ను అధికారులు ఏమీ చేయలేకపోయారన్న విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లిగూడెం పట్ట ణానికి ఆనుకుని పంచాయతీకి చెందిన ఆ కాం ట్రాక్టర్‌ గతంలో నీరు–చెట్టు పనులను దక్కించు కుని పెద్దమొత్తంలో మట్టిని అమ్ముకున్నాడు. ప్రభుత్వ స్థలాల్లోనూ తవ్వకాలు సాగించి మట్టి డాన్‌గా అవతారమెత్తాడు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుని కనుసన్నల్లోనే మట్టి తవ్వకా లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నా యి. మున్సిపాలిటీ చెరువును తవ్వే క్రమంలో అధి కారులు అప్రమత్తమయ్యారు. సదరు చెరువుకు వెళ్లే పుంతను తవ్విపోశారు. వాహనాల రాకపోక లు సాగించకుండా అడ్డుకట్టవేశారు. అయితే దొరి కిన వాహనాలను మాత్రం విడచిపెట్టారు. నియో జకవర్గంలో ఆయన మట్టి తవ్వకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.  


Updated Date - 2021-03-07T05:14:24+05:30 IST