పులి ముసుగులో దొంగలు?

ABN , First Publish Date - 2021-03-07T04:28:22+05:30 IST

పశ్చిమ ఏజెన్సీ బుట్టాయగూడెం మ న్యం ప్రాంతంలో పులి సంచరించడం అవాస్తవమని కన్నాపురం అటవీ శాఖ అధికారి కుంజా కృష్ణకు మారి స్పష్టం చేశారు.

పులి ముసుగులో దొంగలు?
పులి ఆనవాళ్లను పరిశీలిస్తున్న రేంజర్‌ కృష్ణకుమారి

మేకలను ఎత్తుకుపోతున్న వైనం – పులి సంచరిస్తుందని ప్రచారం

బుట్టాయగూడెం, మార్చి 6 : పశ్చిమ ఏజెన్సీ బుట్టాయగూడెం మ న్యం ప్రాంతంలో పులి సంచరించడం అవాస్తవమని కన్నాపురం అటవీ శాఖ అధికారి కుంజా కృష్ణకు మారి స్పష్టం చేశారు. కొవ్వాడ అటవీ ప్రాంతంలో శుక్రవారం పులి సంచరించి కొవ్వా డకు చెందిన మడకం బుచ్చిరాజు మేక లను చంపినట్టు ప్రచా రం జరిగింది. వలంటీర్‌ పులి సంచరిస్తుంది ఎవరూ అడవిలోకి వెళ్లవద్దంటూ మేసేజ్‌లు పెట్టడంతో గిరిజనులు మరింత ఆందో ళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రేంజర్‌ కృష్ణ కుమారి శనివారం కొవ్వాడ అటవీ ప్రాంతంలో పర్యటించి పులి సంచారానికి సంబంధించిన అనవాళ్లకు ప్రయత్నిం చారు. చీకటివాగు, చీకటి కొండ, నీటి వాగు తదితర ప్రాంతాలను పరిశీలించారు. పులి మేకలపై దాడిచేసినా, దూరంగా లాక్కెళ్లినా రక్తపు మరకలు నేలపై పడతాయని,చనిపోయిన మేక ఆనవాళ్లు ఉంటాయని అవేమి కనిపించలేదని తెలిపారు. మన్యంలో పులి సంచారం లేదని స్పష్టం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ అధికారి ఆదివారం ఏజెన్సీలో పర్యటించి పూర్తి వివరాలు సేకరిస్తారన్నారు. కొవ్వాడ, నాగన్న గూడెం ప్రాంతాల్లో మేకలు కనిపించకుండా పోవ డానికి కారణం దొంగల పనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించడానికి దొంగలు వేసిన ఎత్తుగడలో భాగమే పులి సంచారం అంటున్నారు. 

Updated Date - 2021-03-07T04:28:22+05:30 IST