ఉత్సాహంగా జిల్లా స్థాయి నడక పోటీలు

ABN , First Publish Date - 2021-03-07T04:32:29+05:30 IST

ఎయిర్‌ స్ర్టిప్‌ వాకర్స్‌ ఆవరణలో శని వారం జిల్లా నడక పోటీలు నిర్వహించారు.

ఉత్సాహంగా జిల్లా స్థాయి నడక పోటీలు
నడకపోటీలో విజేతలు

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 6 : ఎయిర్‌ స్ర్టిప్‌ వాకర్స్‌ ఆవరణలో శని వారం జిల్లా నడక పోటీలు నిర్వహించారు. ఆత్మబంధువు సేవా సంఘం ఫౌండర్‌ శీతల ఉషాకిరణ్‌ ఆధ్వర్యంలో  800 మీటర్లు, 1600 మీటర్ల కేటగిరీల కింద పోటీలు నిర్వహించారు. పోటీలను పీడీ చింతకాయల సత్యనారాయణ, 10 మంది పీఈటీలు పర్యవేక్షించారు. ఈ రాజేష్‌, నరసింహరాజు, పి.తేజ, 66 సంవత్సరాలు పైబడిన విభాగంలో జి శివప్రసాద్‌, ఎస్‌ఎస్‌ జాని, ఎం.మోహ న్‌లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. 55–65 సంవత్సరాల కేటగిరిలో సీహెచ్‌ గురుమూర్తి, కె.విజయకుమార్‌, డి.నాగరాజు గెలుపొందారు. 

Updated Date - 2021-03-07T04:32:29+05:30 IST