ఈ రోడ్లు ఇంతేనా!

ABN , First Publish Date - 2021-10-25T05:14:24+05:30 IST

తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో ప్రారంభించి ఎన్నికల కోడ్‌తో ఆగిపోయి న అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయక పోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ రోడ్లు ఇంతేనా!
అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ కోసం తవ్వేసి వదిలేసిన లంకపేట ఒకటో నెంబరు రోడ్డు

అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కోసం రోడ్లను తవ్వేరు..

టీడీపీ హయాంలో పనులు ప్రారంభం 

ఎన్నికల కోడ్‌తో ఆగిన వైనం..  ఆపై పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

మూడేళ్లగా వాహనదారులు, స్థానికుల ఇక్కట్లు


ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 24: తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో ప్రారంభించి ఎన్నికల కోడ్‌తో ఆగిపోయి న అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయక పోవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు నగరాన్ని వందేళ్ల నుంచి పట్టిపీడిస్తున్న సమ స్య అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ. ఏ ప్రభుత్వం అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు చేపట్టలేదు. గత టీడీపీ హయాంలో స్మార్ట్‌ సిటీ నిర్మాణంలో భాగంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రెయి నేజీ పనులు ప్రారంభించారు. ముందుగా టూటౌన్‌ ఏరియాలో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు ప్రారంభించారు. డ్రెయిన్ల నిర్మాణం కోసం నివాసాల మధ్యలో ఉన్న రోడ్లను తవ్వి పైపు లైన్లు వేశారు. మరల రోడ్లను పునర్మించేలోగానే ఎన్నికల కోడ్‌ రావడంతో పను లు నిలిచిపోయాయి. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభు త్వం రోడ్లను పునర్మించక పోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కండ్రికగూడెం, లంక పేట, ఇజ్రాయిల్‌పేట, తంగెళ్లమూడి వంతెన మీదుగా మావయ్యగారి తోట వరకూ ఈ పైపులైన్లు వేశారు. ఈ రోడ్లన్నీ మధ్య భాగంలో తవ్వేసి ఉండడంతో వాహన దారులు, టు వీలర్స్‌, ఫోర్‌ వీలర్స్‌ వారు ఇబ్బంది పడు తున్నారు. మరోవైపు అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ కూడా ప్రారంభం కాలేదు. మూడేళ్ల నుంచి ఇదే దుస్ధితి. ఇప్పటి కైనా అధికారులు, ప్రభుత్వం రోడ్లను పునర్నిర్మిం చాలని, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులను తక్షణం పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 


అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు 

నగరంలో అస్తవ్యస్తంగా డ్రెయిన్లు ఉండడంతో వర్షా లు వచ్చినప్పుడు వర్షపు నీరు డ్రెయిన్లలో మురుగు ఏక మై రోడ్ల మీదకు వస్తున్నాయి. రోజుల తరబడి ఆ ము రుగు రోడ్లపై నిలిచి ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పుష్పలీలానగర్‌లో ఇటీవల కురిసిన వర్షాలకు డ్రెయిన్లలో నీరు, వర్షపునీరు ఏకమై రోడ్లపై నిలిచి ఉండడంతో ఇబ్బందులు పడుతు న్నారు. డ్రెయిన్లను ప్రతిరోజు శుభ్రపర్చాలని స్థానికులు కోరుతున్నారు. 


 తెగిపోయిన కరెంటు తీగలు  

అశోక్‌నగర్‌ బ్రిడ్జిపై కరెంటు తీగలు కిందకు వాలిపోయి తెగి పడిపోయి ఉన్నాయి. తమ్మిలేరు వరద వచ్చినప్పుడు ఈ కరెంటు వైర్లు నీటిని తాకితే ఆ నీటిలో కరెంటు పాస్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ కార ణంగా  ప్రాణా పాయం సంభ వించే అవకాశం ఉంది. కరెంటు తీగలను సరిచేయా లని స్థానికులు కోరుతున్నారు.  



Updated Date - 2021-10-25T05:14:24+05:30 IST