36 కేంద్రాల్లో పది సప్లమెంటరీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-07-02T06:10:00+05:30 IST

ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లమెంటరీ పబ్లిక్‌ పరీక్షకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేపట్టింది.

36 కేంద్రాల్లో పది సప్లమెంటరీ పరీక్షలు

ఈనెల 6 నుంచి 15 తేదీ వరకు నిర్వహణ
 హాజరుకానున్న 10,449 మంది విద్యార్థులు

నరసాపురం, జూలై 1: ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లమెంటరీ పబ్లిక్‌ పరీక్షకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేపట్టింది. 36 సెంటర్లలో నిర్వహిం చే ఈ పరీక్షలకు మొత్తం 10,449 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అత్యధికంగా భీమ వరం, అకివీడు, పాలకొల్లు తణుకు, నరసా పురం, అత్తిలి ప్రాంతాల్లో సెంటర్లను ఎంపిక చేశారు. చెరుకువాడ, పెనుగొండ, పైడిపర్రు వంటి గ్రామాల్లోని స్కూళ్ల ల్లోను పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వర కు పరీక్షలు జరు గుతాయని డీఈవో వెంకటరమణ చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రెగ్యులర్‌ మార్కులిస్టే ఇస్తారని తెలిపారు. పరీక్షల ను పర్యవేక్షణకు ఆరు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 46 మంది చీఫ్‌ సూపర్‌వైజర్లను నియమిస్తున్నట్టు చెప్పారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. 

Updated Date - 2022-07-02T06:10:00+05:30 IST