ద్వారకాతిరుమల ఈవోగా సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2021-02-28T05:18:10+05:30 IST
ప్రకాశం జిల్లా కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీవీ సుబ్బారెడ్డి ద్వారకాతిరుమల ఈవోగా రానున్నారు.
ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 27: ప్రకాశం జిల్లా కెఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జీవీ సుబ్బారెడ్డి ద్వారకాతిరుమల ఈవోగా రానున్నారు. ద్వారకాతిరుమల ఈవో పెద్దిరాజు బదిలీ అనంతరం ఎనిమిది నెలల కాలంలో ఆర్.ప్రభాకర్‌రావు, భ్రమరాంబ, చంద్రశేఖర్ ఆజాద్‌లు బాధ్యతలు నిర్వహించారు. దేవదాయ శాఖ రీజనల్ జా యింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పటి వరకు ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు.