వైభవంగా మన్యం వీరుడి జయంత్యుత్సవాలు

ABN , First Publish Date - 2022-06-28T05:29:49+05:30 IST

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను యువతకు స్ఫూర్తి కలిగిస్తూ అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభించారు.

వైభవంగా మన్యం వీరుడి జయంత్యుత్సవాలు
అల్లూరి కాంస్య విగ్రహం

భీమవరంలో రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు
4న ప్రధాని మోదీ ప్రారంభించే విగ్రహం సిద్ధం

భీమవరం, జూన్‌ 27 : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను యువతకు స్ఫూర్తి కలిగిస్తూ అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభించారు. వచ్చేనెల 4వ తేదీన ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం రానున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల 4వ తేదీ వరకు సంబరాల నిర్వహణకు కలెక్టర్‌ ప్రశాంతి ప్రత్యేక క్యాలెండర్‌ రూపొందించారు. ఇందులో భాగంగా తొలిరోజు సోమవారం స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో విద్యార్థులు, బాలలు ప్రదర్శన నిర్వహించారు. భీమవరంలోని అన్ని విద్యా సంస్థల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించడంతో ప్రస్తుతం ప్రతీరోజు కొన్ని విద్యా సంస్థల్లో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సిద్ధమవుతున్న పార్కు.. అల్లూరి విగ్రహం
అల్లూరి సీతారామరాజును శాశ్వతంగా గుర్తించుకునే విధం గా భీమవరం 35వ వార్డు ఎస్‌ఆర్‌ నగర్‌లోని చిల్డ్రన్‌ పార్క్‌లో ఏర్పాటు చేయబోతున్న 30 అడుగుల కాంస్య విగ్రహం సిద్ధమ యింది. గన్నవరంలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని సోమవారం పట్టణానికి తీసుకొచ్చారు. భారీ విగ్రహం కావడంతో అందుకు అనుగుణంగా సిమెంట్‌ దిమ్మ సిద్ధం చేశారు. ఇక్కడ నుంచి నేరుగా వేంపాడు కాల్వ మీదుగా జువ్వలపాలెం రోడ్‌కు ఒక చిన్న వంతెన నిర్మిస్తున్నారు.

Updated Date - 2022-06-28T05:29:49+05:30 IST