కలెక్టరేట్‌ ఆవరణలోనే తొలి పంద్రాగస్టు వేడుకలు

ABN , First Publish Date - 2022-08-13T05:46:29+05:30 IST

నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలను కలెక్టరేట్‌ పక్కనే ఉన్న పచ్చికబయలులో నిర్వహించబోతున్నారు.

కలెక్టరేట్‌ ఆవరణలోనే తొలి పంద్రాగస్టు వేడుకలు
మైదానంలోని గడ్డిని తొలగిస్తున్న దృశ్యం

 భీమవరం, ఆగస్టు 12 : నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలను కలెక్టరేట్‌ పక్కనే  ఉన్న పచ్చికబయలులో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన పనులు శుక్రవారం నుంచి ఉపందుకున్నాయి. కొద్దిరోజులుగా వేడుకలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై కలెక్టరు ప్రశాంతి విష్ణు క్యాంపస్‌, డీఎన్నార్‌ తదితర ప్రాంతాలను పరిశీలించారు. చివరికి కలెక్టరేట్‌ ఆవరణలో ఎడమవైపు ఉన్న మైదానంలో వేడుకలు జరిపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు మైదానంలోని గడ్డిని తొలగించి చదును చేస్తున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్కింగ్‌ తదితర పనులు జరుగుతున్నాయి. ట్రయల్‌ రన్‌, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ డ్రిల్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. జిల్లా విశిష్టతను తెలిపే శకటాలను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-08-13T05:46:29+05:30 IST