హడలెత్తించిన ఇనుప ముక్క..

ABN , First Publish Date - 2022-07-02T06:08:56+05:30 IST

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనకు రానుండడం విదితమే.

హడలెత్తించిన ఇనుప ముక్క..
అనుమానం ఉన్న చోట గొయ్యి తవ్వుతున్న దృశ్యం..

భీమవరం క్రైం, జూలై 1 : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 4వ తేదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనకు రానుండడం విదితమే. ఈ నేపథ్యంలో కాళ్ళ మండలం పెదఅమిరంలో నాలుగు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. వాటిని  ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక డాగ్‌ స్క్వాడ్‌ టీమ్‌   స్కానర్లు ద్వారా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఒక హెలిప్యాడ్‌లో స్కానర్‌ సౌండ్‌ వినిపించింది. వెంటనే అప్రమత్తమైన వారు ఆ ప్రాంతంలో గొయ్యి తవ్వించి చూడగా ఇనుప ముక్క బయట పడింది. దీంతో  ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది నెలల క్రితం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఉండి రోడ్డులోని ఒక పాత ఇనపకొట్టు సమీపంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ ఘటనలో ఆ ప్రాంతంలోని ఆవు మరణించింది. కొంతసేపటికి బైపాస్‌ రోడ్డులో ఖాళీ ట్యాంకర్‌ వెల్డింగ్‌ చేస్తుండగా భారీ శబ్దంతో పేలింది. ఈ రెండు ప్రమాదాలతో అప్పట్లో పోలీసులు హడలెత్తిపోయారు. మళ్లీ ఇప్పుడు ప్రధాని రాక నేపథ్యలో హెలిప్యాడ్‌లో ఇనప ముక్క కూడా అధికారులను పరుగులు పెట్టించింది.



Updated Date - 2022-07-02T06:08:56+05:30 IST