చేయూత..రూ.152.42 కోట్లు

ABN , First Publish Date - 2022-09-24T05:28:40+05:30 IST

జిల్లాలో మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద 81,294 మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.152.42 కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చెప్పారు.

చేయూత..రూ.152.42 కోట్లు
మహిళలకు చేయూత పథకం చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, సెప్టెంబరు 23: జిల్లాలో మూడో విడత వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కింద 81,294 మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.152.42 కోట్లు జమ చేశామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నమూనా చెక్కును లబ్ధిదారులకు ఆమె అందజేసి మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగడానికి చిన్న తరహా వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ జీవనోపాధిని మెరుగుపరచుకోవాలన్నారు. ఆచంట నియోజకవర్గంలో 11,970 మంది మహిళలకు రూ.22.44 కోట్లు, భీమవరం నియోజకవర్గంలో 12,546 మంది మహిళలకు రూ.23.52 కోట్లు, నరసాపురం నియోజకవర్గంలో 7,521 మంది మహిళలకు రూ.14.10 కోట్లు, పాలకొల్లు నియోజకవర్గంలో 12,027 మంది మహిళలకు రూ.22.55 కోట్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 10,721 మంది మహిళలకు రూ.20.10 కోట్లు, తణుకు నియోజకవర్గంలో 12,396 మంది మహిళలకు రూ.23.24 కోట్లు, ఉండి నియోజకవర్గంలో 14,113 మంది మహిళలకు రూ.26.46 కోట్లు అందజేశారు.  కుప్పం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడోవిడత చేయూత పథకం ప్రారంభ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వీక్షించారు. డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్‌, భీమవరం ఎంపీపీ విజయనరసింహరాజు, నరసాపురం డీఎస్‌డీవో కేసీహెచ్‌ అప్పారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T05:28:40+05:30 IST