అభిమాని కోర్కె తీర్చిన మెగాస్టార్‌ చిరంజీవి

ABN , First Publish Date - 2022-08-09T06:18:41+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి తన స్వగ్రామమైన మొగల్తూ రుకి చెందిన ఓ అభిమాని కోర్కె తీర్చారు.

అభిమాని కోర్కె తీర్చిన మెగాస్టార్‌ చిరంజీవి
నాగరాజుతో మాట్లాడుతున్న చిరంజీవి

 వైద్యం అందించేందుకు భరోసా
హైదరాబాద్‌ వెళ్లి కలిసిన నాగరాజు

మొగల్తూరు, ఆగస్టు 8: మెగాస్టార్‌ చిరంజీవి తన స్వగ్రామమైన మొగల్తూ రుకి చెందిన ఓ అభిమాని కోర్కె తీర్చారు. రెండు కిడ్నీలు పాడై ఇబ్బందులు పడుతున్న అతడికి వైద్యం అందించేందుకు ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళితే గోడావారిపేటకు చెందిన కొయ్య నాగరాజు చిరంజీవికి అభిమానిగా ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. దురదృష్టవశాత్తూ ఇటీవల ఇతనికి రెండు కిడ్నీలు దెబ్బతినడంతో ఆర్థికంగా సతమతమవుతున్నాడు. దీంతో తాను చిరంజీవిని కలిసి మాట్లాడాలని సామాజిక మాధ్యమాల్లో కోరాడు. విషయాన్ని డిజిటల్‌ మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి నాగ రాజును తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. నాగరాజు ఈనెల ఐదో తేదీన అతని భార్యతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లగా, ఆరోగ్య పరిస్థితిని చిరంజీవి తెలుసుకొని మెడికల్‌ రిపోర్టులు పరిశీలించారు. పూర్తిస్థాయిలో కార్పొరేట్‌ వైద్యమందించే ఏర్పాట్లు చేస్తానని మెగాస్టార్‌ చిరంజీవి భరోసా ఇచ్చారు.

Updated Date - 2022-08-09T06:18:41+05:30 IST