కోడి పుంజులు అరెస్ట్‌..!

ABN , First Publish Date - 2022-01-20T06:16:03+05:30 IST

సంక్రాంతి వెళ్లింది. కోడి పందేలూ ముగిశాయి

కోడి పుంజులు అరెస్ట్‌..!

( పాలకొల్లు రూరల్‌)

సంక్రాంతి వెళ్లింది. కోడి పందేలూ ముగిశాయి. పం దెగాళ్ల చేతుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారా యి. అయితే పోలీసు దాడుల్లో చిక్కిన పందెం పుంజు లు మాత్రం స్టేషన్లలో బందీలయ్యాయి. ఇలాంటి జాతి పుంజులు అర డజనుకుపైగా పాలకొల్లు రూరల్‌ స్టేషన్‌ లో కనిపించాయి. ఐరన్‌ మెస్‌లను ఏర్పాటు చేసి వాటి ల్లో ఉంచారు. వాటి పోషణను పోలీసులే చేపట్టారు. పందేలపై కేసు నమోదైన తర్వాత పుంజులను న్యాయ స్థానం ముందుప్రవేశ పెట్టి వాటిని వేలం వేసే వరకూ వాటి పోషణ భారం పోలీసులదే. నిందితులను అరెస్ట్‌ చేసినట్టే.. కోళ్లనూ అరెస్ట్‌ చేసి జైలులో ఉంచారంటూ స్టేషన్‌కు వస్తున్న వారు ముచ్చటించుకుంటున్నారు.   

Updated Date - 2022-01-20T06:16:03+05:30 IST