విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులు

ABN , First Publish Date - 2022-01-22T05:05:53+05:30 IST

కరోనా దెందులూరు మండలంలో విజృంభిస్తోంది.

విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులు

దెందులూరు, జనవరి21: కరోనా దెందులూరు మండలంలో  విజృంభిస్తోంది. సంక్రాంతి సందర్భం గా మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు, పలు క్రీడలు నిర్వహించగా జనం కరోనా జాగ్రత్తలు తీసుకోకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తు తం ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. మండలంలో అనాధికారికంగా 18 మంది కరోనా బారిన పడగా, అధికారికంగా నలుగురు పంచాయతీ సర్పంచ్‌లు, ముగ్గురు ఎంపీటీసీలు, ఒక మండల స్థాయి ప్రజా ప్రతినిధి, పలువూరు నాయకులు మొత్తం 9 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వీరితో కలసి తిరిగిన పలువురు ఆందోళన చెందుతున్నారు. కొంత ప్రజాప్రతినిధులు ఇప్పటికే హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కొంతమంది మాత్రం మాకు ఎలాంటి లక్షణాలు లేవని యథేచ్ఛగా తిరుగుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించా లని, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్‌ను  వినియోగించాలని ప్రభుత్వ వైద్యు లు సూచిస్తున్నారు.

పెదపాడు మండలంలో ఎనిమిది కేసులు
పెదపాడు, జనవరి 21 : పెదపాడు మండలం శుక్రవారం ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరులో 4, అప్పనవీడులో ఒకటి, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో పెదపాడులో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు వైద్యసిబ్బంది తెలిపారు.

కరోనా నిబంధనలు పాటించకపోతే జరిమానా

పెదవేగి, జనవరి 21 : కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోం దని, ఈ సమయంలో ప్రజలు మరిం త జాగ్రత్తలు తీసుకోవాలని పెదవేగి ఎస్‌ఐ టి.సుధీర్‌ సూచించారు. పెదవే గిలో వాహనాల తనిఖీ నిర్వహించి కొవిడ్‌ నిబంధనలు పాటించని వాహ న చోదకులకు జరిమానా విధించి, కరోనా వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా వాహ న దారులు రహదారి పైకి వస్తే జరిమానా తప్పదని ఎస్‌ఐ హెచ్చరించారు.

ఒమైక్రాన్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి
ఏలూరు కార్పొరేషన్‌, జన వరి 21 : ఒమైక్రాన్‌ పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకో వాలని డాక్టర్‌ పి.మంజూష తెలిపారు. హనుమాన్‌ నగర్‌లోని 90వ నెంబరు అంగన్‌వాడీ కేంద్రంలో శుక్ర వారం చిన్నారులకు, కిశోర బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తీసుకో వాల్సిన ఆహార పద్ధతులను, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఒమైక్రాన్‌ బారిన పడకుండా ప్రతీ ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను పరిశుభ్రపరచుకోవాలని సూచించారు. ఐసీడీ ఎస్‌ సూపర్‌వైజర్‌ టి.జోషి, పీహెచ్‌ఎన్‌ బి.సీతామహాలక్ష్మి, ఆరోగ్య కార్యదర్శి వి.శ్రావణ సంధ్య, బి.వనిత, అంగన్‌వాడీ టీచర్లు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:05:53+05:30 IST