కరోనా దూకుడు

ABN , First Publish Date - 2021-04-24T04:45:55+05:30 IST

గ్రామాల్లో కరోనా కేసులు రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో గ్రామీణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

కరోనా దూకుడు
గుబ్బలవారి వీధిలో రెడ్‌జోన్‌ ఏర్పాటు చేస్తున్న మునిసిపల్‌ సిబ్బంది

ఏలూరు రూరల్‌ మండలంలో మరో ఐదు కేసులు 

గ్రామాల్లో వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతి

గతేడాది కంటే వేగంగా విస్తరణ

నగరంలోనూ అదే జోరు.. తొలి రెడ్‌జోన్‌ ఏర్పాటు 

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 23 : గ్రామాల్లో కరోనా కేసులు రోజురోజుకు  చాపకింద నీరులా విస్తరిస్తుండడంతో గ్రామీణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా గతేడాది కంటే వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడిం చిన కరోనా కేసుల్లో మండలంలో తాజాగా ఐదు కేసులు నమోదైనట్టు వెల్లడించారు. సత్రంపాడు, తంగెళ్లమూడి, పోణంగి, వెంకటాపురం, శనివారపుపేటలో ఒక్కొక్క కేసు నమోదైంది. కొవిడ్‌ కేసులు నమోదైన ప్రాంతా ల్లో సూపర్‌ శానిటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించా రు. ప్రతి వీధిలో బ్లీచింగ్‌తో పాటు సోడియం హైపో క్లోరెడ్‌ పిచికారీ చేశారు. ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షా ఫలితాల్లో తీవ్ర జాప్యం నెలకొనడం, పరీక్షల కోసం వేచి ఉన్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండ డంతో ప్రస్తుతం యాంటీ జన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నా రు. చాటపర్రు, గుడివాకలంక పీహెచ్‌సీ పరిధిలో వ్యాక్సి నేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.


గతేడాది కంటే  దూకుడు

గతేడాది ఇదే సమ యానికి నమోదైన కరోనా కేసుల కంటే ఏప్రిల్‌ నాల్గొవ వారానికి అధికంగా కేసులు నమోదుతో ఆందోళన కలిగిస్తోంది. కనీసం రోజుకు పది కేసుల నమోదు కావడం చూస్తే సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ గతం కంటే వేగం గా వ్యాప్తి చెందుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కట్టడికి గ్రామాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కేసుల ఉధృతి తగ్గడం లేదు. మరోవైపు మాస్క్‌లు ధరించాలని భౌతిక దూరం పాటించాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఎవరు పట్టించుకున్న దాఖలాలు కన్పించడం లేదు. 


గ్రామాల్లో కట్టడికి చర్యలు

కరోనా నియంత్రణ కోసం గ్రామాల్లో పలు నిషేధా జ్ఞలు ప్రకటించారు. ఆరు గంటల నుంచి సాయం త్రం ఆరు గంటల వరకూ మాత్రమే షాపులు తెరచి ఉంచాలని ఆదేశించారు. మాస్క్‌లు ధరిం చని వారికి రూ.100 అపరాధ రుసుము విధిం చాలని తహసీల్దార్‌ బి.సోమశేఖర్‌ తెలిపారు. చిల్లర దుకాణాలు, కూరగాయల షాపులకు వ చ్చే ప్రజలు తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించా రు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌ లు అప్రమత్తంగా ఉండాలని ఇన్‌ఛార్జి ఎంపీడీవో సరళకుమారి కోరారు. కరోనా లక్షణాలతో ఎవరైనా బాధ పడుతుంటే వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. ముఖ్య మైన పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని విస్తృతంగా ప్రచారం చేయాలని, మాస్క్‌లు, శానిటైజర్‌, భౌతిక దూరం వంటి అంశాన్ని ఖచ్చితంగా పాటించేలా ప్రచారం చేయాలన్నారు.  


టెస్టింగ్‌ సరే.... ట్రేసింగ్‌ ఏది 

 కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. గ్రామాల్లో రోజుకు సరాసరిన 15 కేసులు నమోదవుతున్నాయి. అయినా ప్రజల్లో అప్రమత్తం లేదు. లక్షణాలు కని పిస్తున్న వారు మాత్రం పరీక్షలు చేయించుకుంటున్నారు. పాజిటివ్‌ నిర్ధారణ అయినవారు మాత్రం  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి కుటుంబ స భ్యులు, సన్నిహితులు మాత్రం యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారు. గతేడాది పాజిటివ్‌ వస్తే వారికి దగ్గరగా ఉన్న వారిని గుర్తించి హోం క్వారెంటైన్‌లో ఉం డాలని నోటీసులు జారీ చేసేవారు. ఈసారి ఎలాంటి చర్యలు కనపడడం లేదు. దీంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అధికారులు కరోనా బాధితుల కాంటా క్టుల ను గుర్తించి ఇంట్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పుడే నియంత్రణ సాధ్య మని పలువురు సూచిస్తున్నారు.

 

శాంపిల్స్‌ సేకరణలో అలసత్వం 

కొవిడ్‌ పరీక్షలు గ్రామాల్లో నత్తనడకన జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో మాత్రమే పరీక్ష లు చేస్తున్నారు. కొవిడ్‌ వేగంగా విస్తరిస్తున్నా శాంపిల్స్‌ సేకరణలో సిబ్బంది అలసత్వం వహించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 


 రెడ్‌జోన్‌ ఏర్పాటు

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 23 : ఏలూరు నగరంలో కరోనా వైరస్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్టు రికార్డుల్లో స్పష్టమైంది. ఇప్పటికే నగరంలో షాపులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉంటు న్నాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గతంలోలాగానే రెడ్‌జోన్ల ఏర్పాటుకు శ్రీకా రం చుట్టారు. శుక్రవారం రాత్రి గబ్బలవారి వీధిలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఉండడంతో ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి మునిసి పల్‌ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 


ప్రాణ రక్షణకు మాస్క్‌లు ధరించండి 

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 23 : పోలీసులను చూసి మాస్క్‌లు పెట్టడం కాద ని, తమ ప్రాణాలు కాపా డుకోవడానికి ప్రజలు మా స్క్‌లను ధరించాలని జిల్లా ఎస్పీ కె.నారాయణ నాయ క్‌ సూచించారు. మాస్క్‌లు ధరిస్తున్నారో లేదో స్వయంగా తెలుసుకోవడానికి ఎస్పీ రంగంలోకి దిగారు. డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌, టూటౌన్‌ సీఐ బోణం ఆది ప్రసాద్‌, ఏలూరు రూరల్‌ సీఐ ఎ.శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ చావాసురేష్‌, టూటౌన్‌ ఎస్‌ఐ బి.నాగబాబు సిబ్బందితో  శుక్రవారం మధ్యాహ్నం ఆయన  ఫైర్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మూడు వైపుల నుంచి వచ్చే వాహనాలను ఆపి పరిశీలించారు. ఎస్పీ స్వయంగా బస్సుల్లోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి ఇంటి వెళ్లేవరకూ అత్యంత జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిదన్నారు. బయటకు వచ్చినవారు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవ హరించినా వారితో ఆ వైరస్‌ ఇంటికి చేరుతుందని, దీంతో ఇంటి కుటుంబ సభ్యులందరూ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోందన్నారు. వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే మాస్క్‌ వాడడం, చేతులను శుభ్ర పర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌ కిరణ్‌ మాట్లాడుతూ నిబంధనలు ఎవరు అతిక్రమించినా కేసులు నమోదు చేస్తామన్నారు.


పోలీస్‌ స్టేషన్లలో సూపర్‌ శానిటేషన్‌

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 23 : జిల్లాలోని ప్రతి పోలీ స్‌ స్టేషన్‌లో శానిటేషన్‌ చే యాలని జిల్లా ఎస్పీ కె.నా రాయణ నాయక్‌ ఆదేశా లు ఇవ్వడంతో జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. స్టేషన్‌లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా సూపర్‌ శానిటేషన్‌ చేయిస్తున్నారు. ఏలూరు నగరంలో ఉన్న పోలీస్‌ స్టేషన్లలను శుక్రవారం ఉదయం పిచికారీ చేశారు. 


మాస్కు లేకుంటే జరిమానాలు 

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 23 : ఏలూరు నగరంలో వ్యాపారులు ఖచ్చితంగా మాస్కు ధరించి వ్యాపారా లు కొనసాగించాలని, వారి వద్దకు వచ్చే కొను గోలుదారులూ ఖచ్చితంగా మాస్క్‌ ధరించాలని లేదంటే వ్యాపారులకే జరి మానాలు విధిస్తామని పోలీసు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు  జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు ట్రాఫిక్‌ ఎస్‌ఐ బుద్దాల శ్రీనివాస రావు శుక్రవారం మధ్యాహ్నం ఆర్‌ఆర్‌పేట ఫుట్‌పాత్‌ వ్యాపారులు ఏవిధంగా వ్యాపారాలు కొనసాగి స్తున్నారో, వారు మాస్క్‌ ధరించారా లేదా అనే విషయాలను స్వయంగా పరిశీలించారు. ధరించని వారికి జరిమానాలు విధించారు.  

Updated Date - 2021-04-24T04:45:55+05:30 IST