పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2021-04-24T04:39:02+05:30 IST

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 58 శాతం పెంచిన ఎరువులు తగ్గిం చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి
ధర్నాలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 23 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 58 శాతం పెంచిన ఎరువులు తగ్గిం చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. భారత్‌ కిసాన్‌ సభ, సీపీఐ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఐ ఏలూరు కన్వీనర్‌ ఉప్పులూరి హేమ శంకర్‌ ఆశ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ రైతాంగాన్ని వెన్నుపోటు పొడవడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చిందన్నారు. పాత ధరలకే ఎరువులు విక్రయించా లని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పుప్పాల కన్నబాబు, నాయకులు కె.కన్న య్య, పి.పెంటయ్య, బళ్ళా కనక దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-24T04:39:02+05:30 IST