కర్ఫ్యూ కట్టుదిట్టం

ABN , First Publish Date - 2021-05-07T05:42:18+05:30 IST

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి కర్ఫ్యూని పోలీసులు పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంట

కర్ఫ్యూ కట్టుదిట్టం
నిడదవోలు గణపతి సెంటర్‌లో కర్ఫ్యూ తీరును పరిశీలిస్తున్న సీఐ స్వామి

నిడదవోలు, మే 6 :  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి కర్ఫ్యూని పోలీసులు పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జన జీవనానికి అధికారులు అనుమతిస్తు న్నారు. సెకండ్‌ వేవ్‌ కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూకి ప్రజలు సైతం స్వచ్ఛంధంగానే సహకరిస్తు న్నారు. మధ్యాహ్నం 12 గంటల అనంతరం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. గురువారం పలు ప్రాంతాలలో కర్ఫ్యూ అమలవుతున్న తీరును సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌  కేఏ స్వామి పరిశీలించారు. అనవసరంగా రోడ్లమీదకు వస్తున్న పలువురికి కౌన్సె లింగ్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వై.జగదీశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.


12 గంటల వరకే తెరిచిన దుకాణాలు 

గణపవరం, మే 6: కరోనా కట్టడి చేసేందుకు అమలు చేస్తున్న కర్ఫ్యూ నియంత్రణకు కవచం వంటిదని అందరూ సహకరించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ వీరబాబు హెచ్చరించారు. రెండో రోజు గురువారం గణపవరం మండల గ్రామాల్లో కర్ఫ్యూ విజయవంతంగా అమలు జరిగింది. ఉదయం 6గ నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచారు. బ్యాంకులు మాత్రం 9 గంటల నుంచి 12గంటల వరకే లావాదేవీలు జరిగాయి. అనంతరం 12 గంటల నుంచి బ్యాంకులు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. అర్థవరం, పిప్పర, గణపవరం, సరిపల్లె, గ్రామాల్లోని బ్యాంకులకు గడువు చాలకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరూ రహదారులపై సంచరించరాదని, మాస్కులు ధరించాలని లేని పక్షంలో చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు. 


పెంటపాడులో పోలీసుల పహారా 

పెంటపాడు, మే, 6 : మండలంలో కొవిడ్‌ కర్య్పూ తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు పహారా నిర్వహిస్తున్నారు. కర్య్యూ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కర్ప్యూ భయంతో ప్రజలెవ్వరూ బయటకు రావడం లేదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని తాడేపల్లిగూడెం రూరల్‌ సీఐ రవికుమార్‌, పెంటపాడు ఎస్‌ఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. 


Updated Date - 2021-05-07T05:42:18+05:30 IST