సీడబ్ల్యూసీ జిల్లా కమిటీ నియామకం

Nov 27 2021 @ 23:57PM
సమావేశంలో పాల్గొన్న సీడబ్ల్యూసీ చైర్మన్‌, సభ్యులు

ఏలూరు రూరల్‌, నవంబరు 27: జిల్లా బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ)ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. చైర్‌పర్సన్‌గా బి.రబ్కారాణి, సభ్యులుగా కె.హైమావతి, పి.వెంకటేశ్వరరావు, సి.హెచ్‌.రాజేశ్వరరావులను నియ మిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో శనివారం వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రబ్కారాణి మాట్లాడుతూ జిల్లాలో బాల, బాలి కల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. బాలల హక్కులను కాపాడతామని, బాల్య వివాహాలు నివారిస్తామన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ సందర్భంగా శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర గృహంలో బెంచ్‌ నిర్వహించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.